... పాల సముద్రంలో పుట్టిన హాలాహలంను మింగి మగత నిద్రలోకి జారుకుని తిరిగి మేలుకున్న సందర్భంగా శివుడిని తన రథం పై ఊరేగింపు నిర్వహిస్తాడు బ్రహ్మ. దీనినే రథోత్సవం అని అంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీకాళహస్తిలో రథోత్సవం జరగడం ఆనవాయితీ గా ఉంది. వేల మంది భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి బ్రహ్మ రాత్రి అంటారు.
అని ఆర్యోక్తి.రథంపై ఊరేగే శంకరుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బ్రహ్మ రాత్రి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి బ్రహ్మ రథంపై, అమ్మవారు మరో రంగంలో స్వామిని అనుసరించారు. ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి తీసుకొచ్చి రథా లకు సమీపంలో ఉన్న నెప్పల మండపంలో ఉంచి పూజలు చేశారు అర్చకులు. ఆ తర్వాత రథంపై స్వామి అమ్మవార్లను అలంకరించి రథోత్సవం నిర్వహించారు. రెండు రథాలు ఒకేసారి రావడానికి వీలు లేక పోవడం వల్ల ముందుగా స్వామి వారి రథాన్ని తర్వాత అమ్మవారి రధాన్ని భక్తులు లాగడం జరిగింది.
No comments:
Post a Comment