Saturday, 19 October 2019

Kanipakam

కాణిపాకం విశిష్టత - :

ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడుకట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.

చరిత్ర - :

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరినీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

ఏలా వెళ్ళాలి - :               
                                     
బస్సు సౌకర్యములు తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.విమాన సౌకర్యములు తిరుపతి .

కాణిపాకం ఆలయ సమూహము:

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

Friday, 5 April 2019

శ్రీ కాళహస్తి స్థల పురాణం

భక్త కన్నప్ప  మహా భక్తుడు శ్రీకాళహస్తి ఈశ్వరూడుకు తన నేత్రం ప్రసాదించి తిన్నడు ఐయాడు శివ రాత్రి పర్వదినం నాడు కనప్ప  కు మొదటి పూజ జరపడం ఆనవాయతి.

పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయు లింగం వీటిని కలిపి పంచభూత శివలింగాలు అని అంటారు. పంచభూత లింగాలలో వాయు లింగం ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. మరి శ్రీకాళహస్తి లో దాగి ఉన్న కొన్ని నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించాడని చరిత్ర చెబుతుంది. అతి ప్రాచీన ఆలయమని చెప్పబడే ఈ ఆలయంలో పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం ఉంది. ఈ ఆలయ గర్భాలయంలో రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడి స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. ఇక్కడి అమ్మవారి తల భక్తుల కోరికలను వింటునట్లుగా ఒకవైపు తలని వాల్చినట్లు దర్శనమిస్తుంటుంది. ఇలాంటి అమ్మవారి విగ్రహము ఈ ఆలయంలో తప్ప మరొక ఆలయంలో కనిపించదు.
ఈ ఆలయంలో ముందుగా పాతాళగణపతి కనిపిస్తారు. ఈ స్వామిముందు నిలబడి నాలుగు సార్లు వినాయకుడిని తలుచుకుంటే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇంకా ఈ ఆలయంలో పాతాళ గణపతి ఉత్తరం వైపు, జ్ఞానప్రసూనాంబ తూర్పువైపు, కాళహస్తీశ్వరుడు పశ్చిమం వైపు దక్షిణామూర్తి దక్షిణం వైపు తిరిగి ఉంటారు. ఈవిధంగా ఒకే దేవాలయంలో నలుగురు దేవతలు నాలుగు వైపులా చూస్తూ దర్శనం ఇవ్వడం అనేది విశేషం.

దేశంలో అన్ని ఆలయాల్లో గ్రహణం ఉన్నంతసేపు ఆలయాన్ని మూసివేస్తారు. కానీ గ్రహణం రోజున కూడా తెరిచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి. ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో కాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. కాశీక్షేత్రం వలే ఇక్కడ చనిపోయే వారికీ పరమశివుడు ఓం కార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకం.

పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు. ఈ క్షేత్రంలోని శివలింగం వర్తులాకారంవలె గాక చతురస్రముగా ఉంటుంది. స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం బ్రహ్మకి జ్ఙానమును ప్రసాదించిన ప్రదేశం అని చెబుతారు. ఈ పవిత్ర స్థలంలో పరమేశ్వరుడిని అత్యంత భక్తితో శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినవి. అందువలనే ఈ స్థలమునకు శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినది అని చెబుతారు.
ఈ ఆలయం దేశంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలోపల అమ్మవారి సన్నిధి కి సమీపంలో ఒక ప్రదేశం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలు సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది.

Monday, 4 March 2019

జ్యోతిర్ లింగాల


మన దేశం లో ద్వాదశ జ్యోతిలింగాలు అని 12 , పంచారామాలు అని 5 , పంచభూత లింగాలు అని 5 మొత్తం 22 శివుని ఆరాధించే ముఖ్యమైన గుడులు ఉన్నాయి.
1. సోమనాథుడు – సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్
2. మల్లికార్జునుడు – శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3. మహాకాళుడు – (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు – మామలేశ్వరము, మధ్య ప్రదేశ్
5. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) – పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్
6. భీమశంకరుడు – డాకిని, మహారాష్ట్ర
7. రామేశ్వరుడు – రామేశ్వరము, తమిళనాడు
8. నాగేశ్వరుడు – ద్వారక , మహారాష్ట్ర
9. విశ్వనాథుడు – వారణాసి, ఉత్తరప్రదేశ్
10. త్రయంబకేశ్వరుడు – నాసిక్, మహారాష్ట్ర
11. కేదారేశ్వరుడు – హిమాలయాలలో, ఉత్తరప్రదేశ్
12. కుసుమేశ్వరుడు – వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర
పంచారామాలు
తారకాసురుడనే రాక్షసుడు, పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ లింగాన్ని తన గొంతులో ఉంచుకుంటాడు . అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లెకుండా వరం పొందుతాడు. వరం వల్ల గర్వంతో ఆా రాక్షసుడు దేవతల్ని బాధిస్తున్నడంతో, దేవతలందరు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు – కుమారస్వామి ఉదయించాడు. తారకాసురుడిని సంహరించాడు.
ఆ రాక్షసుడి గొంతునుండి పడిన ఆత్మ లింగం ముక్కలయ్యి 5 చోట్ల పెద్దవి వాటిని దేవతలు పంచారామాలుగా ప్రతిష్టించారు .
పంచభూత లింగాలు:
పంచభూతాలైన, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి స్వరూపాలుగా శివుడు లింగ రూపమై ఐదు చోట్ల ఉన్నారు.. వాటిని పంచభూతలింగాలు అంటారు..
1. పృథ్విలింగం
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
4. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
5. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

Tuesday, 2 October 2018

వెంకటేశ్వర స్వామి

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

భారత దేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కాడ మనికి కనిపించవు. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం కూడా అదే కోవకు వస్తుంది. సాధారణంగా మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు పూజారి హారతి ఇచ్చే సమయంలో మూలవిరాట్టును చూసే ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథనంలో హారతి ఇచ్చే సమయంలో ఆ మూలవిరాట్టు కన్నులు విప్పారుతాయి. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం, చెన్నై

ఈ దేవాలయం చెన్నైలోని నెరుకుండ్రలోని కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం. ఇక్కడ మూలవిరాట్టు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు. విగ్రహం నల్లని రంగులో ఉండటాన్ని మనం గమనించవచ్చు.
 
ఇక్కడ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసారని కొంతమంది చెబితే మరికొంతమంది లేదు ఇది ప్రతి ష్టించిన విగ్రహం అని చెబుతారు. ఇక ఇక్కడ వేంకటేశ్వరుడితో పాటు శ్రీ దేవి, భూదేవి కూడా ఉన్నారు.

ఈ దేవాలయంలో దేశంలో మరెక్కడా లేనట్లు హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆర్పివేస్తారు. దీంతో గర్భగుడి మొత్తం చిమ్మచీకటిగా మారిపోతుంది.

   అటు పై పూజారి హారతి పళ్లాన్ని దేవుడి మొహం సమీపంలోకి తీసుకువచ్చిన తక్షణం మూలవిరాట్టు నేత్రాలు విశాలమవుతాయి. దీంతో స్వామివారు నేరుగా ఆ హారతిని చూస్తున్నారా? అని పిస్తుంది.

   ఈ విధంగా హారతి ఇచ్చే సమయంలో స్వామివారు కళ్లు తెరవడం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. మిగిలిన సమయంలో స్వామివారు కళ్లు మూసుకున్న స్థితిలోనే మనకు కనిపిస్తారు.

   దీనిని స్వామివారి మహిమ అని కొంతమంది చెబుతారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ విగ్రహం చెక్కిన శిల్పి నైపుణ్యమని చెబుతారు. కరి వరదరాజ పెరుమాల్ దేవుడిని 27 నక్షత్రాల దేవుడని పిలుస్తారు.

   అంతేకాకుండా తొమ్మిది దేవుడని కూడా పిలుస్తారు. భక్తులు తమ కోరికను స్వామివారికి తెలిపి తొమ్మిది రుపాలయలు దక్షిణగా వేస్తే వెంటనే ఆ కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.

   కోర్కెలు నెరవేరిన తర్వాత వరుసగా తొమ్మిది రోజుల పాటు మరలా ఈ దేవాలయానికి వచ్చి దేవుడికి పూజలు చేయిస్తారు. విష్ణుపురాణంలో చెప్పినట్లు గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం ఇదే అని చెబుతారు.

   గజేంద్రుడి కాలును పట్టుకొన్న మొసలిని సంహరించిన ప్రదేశం ఇదేఅని ఇక్కడి వారి నమ్మకం. ఈ దేవాలయం సుమారు 1100 ఏళ్లకు పూర్వం నాటిదని చెబుతారు

   ఇక్కడ రామానుజాచార్యులు, ఆంజనేయస్వామికి ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం చెన్నైలోని కొయంబీడు బస్ స్టేషన్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

   ఈ దేవాలయం గురించి ఎక్కువ మందికి తెలియదు. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఇక్కడ మనకు కనిపించరు. అందువల్ల మనం స్వామివారి మహిమను ఎన్నిసార్లైనా కళ్లారా చూడవచ్చు.
గోవింద గోవిందా.....

Saturday, 8 September 2018

Confidence

http://thypsychology.blogspot.com/2018/09/the-secret-of-self-confidence-revealed.html?m=1

Sunday, 26 August 2018

శ్రీ వీరఆంజనేయ స్వామి


భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు. ఆయన ఉన్న చోట లక్ష్మీ కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు. అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు.

ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అందుకు ప్రతీకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి.
త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.

Sunday, 19 August 2018

శ్రీకాళహస్తీ

శ్రీ కాళహస్తి ప్రముక్యత:

బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించిన ఆర్పలేకపోయిన శివ జ్యోతి ... నేటికీ అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది ...

పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు.కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం.గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు.అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు.అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.

24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది.అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతు వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది.అప్పుడు స్వామి వారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యెక పూజలు చేయమని అర్చకులకు మనవి చేసాడు.తనని ఆలయంలోకి తీసుకెళ్ళమని చెప్పి అక్కడ స్వామి వారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది.

అంతే కాకుండా ఈ స్వామి వారిని ఒక శ్రీ - సాలెపురుగు , కాళము - ఒక పాము , హస్తి - ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.

శ్రీ కాళహస్తి మహత్యం:

తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం

ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.

అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.

తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ''అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా'' అని పిలిచాడు.

మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.

అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ''మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.

మహాశివుడు చిరునవ్వు నవ్వి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.

శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది.

రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.

తిన్నడు మరింత దుఃఖిస్తూ, ''శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..'' అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.

అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.

తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు. పేరు కన్నాప గా నామా కారణం చేయడం జరిగింది.
అప్పటి నుండీ ఆలయం లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో మొదటి పూజ కన్నాప తో మొదలు పెడతారు.

ఓం నమః శివాయ
కైలాసి భగవాన్ శ్రీ కాళహస్తి ఈశ్వర శివ కరోతి నిత్య కల్యాణ కరుణ వరుణ లయహః.
ఒం నమః శివాయనమః

Wednesday, 15 August 2018

తిరుమల అష్ట దిగ్బంధం

*అష్టబంధనం - అష్టదిక్కుల్లో సంధిబంధనం*

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తి (ధృవమూర్తి) పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు ఎనిమిది వైపులా సంధిబంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఋత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. అదేవిధంగా, ఉదయం 6 నుండి 12 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగు మహర్షి రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంథంలో ఇలా వివరించారు.

*''శంఖచూర్ణం, మధూచ్ఛిష్టం, లాక్షా త్రిఫలమేవ చ|*

*కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్తశిలాకృతమ్‌||*

*మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృత:||''*

8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో 1.శంఖచూర్ణం - 25.5 తులాలు, 2.మధుజ (తేనెమైనం)- 3.5 తులాలు, 3.లాక్షా(లక్క) - 3.75 తులాలు, 4.గుగ్గులు(వృక్షపు బంక)- 9 తులాలు, 5.కార్పాసం(ఎర్ర పత్తి)- 1 తులం, 6.త్రిఫలం(ఎండిన    ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ)- 7.5 తులాలు, 7.రక్తశిలాచూర్ణము (గైరికము)- 7.5 తులాలు, 8.మాహిష నవనీతము (గేదె వెన్న) - 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

*శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని  ఆరాధిస్తారు.*

ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయారవుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు.