Tuesday, 22 September 2026

వామన జయంతి

భాద్రపద శుక్ల ద్వాదశి  -  వామన జయంతి*
*వామనావతారం*
------------------------------------
*అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది* *అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు.* *ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా!* *మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన* *విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.*
*ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’* *అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది.* *దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది.* *అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు.* *శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.*
*ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా?* *శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా* *వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన* *బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ* *శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.*
*శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని* *ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు.* *ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.*
*కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి* *అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి?* *కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు* *పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని* *బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు* అనుకున్నట్లయితే *మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.*
*ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది.* *భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా* *శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి* *నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.*
*స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని* *అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా* *పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు* *శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.*
*గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ* *అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం* *చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా* *మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు.* *యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా* *బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.*
*బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును* *తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు.* *వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.*
*‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ* *ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం* *మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి.* *ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు* *అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు,ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు.* *పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.*
*వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో*
*కరులో రత్నములో రథంబులొ* *విమృష్టాన్నంబులో కన్యలో*
*కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో*
ధరణీఖండమొ కాక *ఏమడిగెదో* *దాత్రీసురేంద్రోత్తమా!*
*ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన* *బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల* *సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు* *సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల* *ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో* *ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.*
*బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.*
*వామనుడు ఆశ్రమ* *ధర్మమును పాటించాడు*
*గొడుగో, జన్నిదమో,* *కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,*
*వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె*
*క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ?* *మదాకాంక్షామితంబైన మూఁ*
*డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.*
*‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను* *పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు.* *బలిచక్రవర్తి*
*ఓ వటువా! ఇదిగో* *బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ* *పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ!* *బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు* *పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.*
*వారిజాక్షులందు* *వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు*
*జకిత గోకులాగ్ర* *జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !*
*శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.*
*బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు!* *లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.*
*ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై,* *నంసోత్తరీయంబుపై*
*బాదాబ్జమ్ములపై* *గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ*
*ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా* *కరంబుంట మేల్*
*గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే?* *కాయంబు నాపాయమే ?*
*‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను* *నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై* *చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది.* *దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం* *కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ* *అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ* *రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.*
*కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?*
*వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.*
*బేరైనం గలదే?* *శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.*
*యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!*
*‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని* *పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత* *సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన* *మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై* *నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!*
*నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను,నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే.* *భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.*
*వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.*
----------------------------------
*వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.*
-----------------------------------
*ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై,* *నభోవీధిపై*
*నంతై,* *తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై*
*నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై,* *మహర్వాటిపై*
*నంతై,* *సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.*
*పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు.* *బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు.* *లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి,ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు* *భూమ్యాకాశములను కొలిచాడు.*
*రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై*
*శ్రవణాలంకృతియై గళాభరణ మై* *సౌవర్ణకేయూరమై*
*ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర*
*ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.*
------------------------------------
*వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది.* *బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.*
*ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి*
*సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు,*
*నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!*
----------------------------------
*నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని* *తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు.* *రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.*
*పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు.* *అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’* *అన్నాడు.*
*శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు,సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా* *నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు.* *సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను.* *అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను.* *సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.*
*మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.*
-----------------------------------
*‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు.* *యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ* *శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.*
*ఈ వామనమూర్తి కథను వింటున్నవారు* *‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే.* *ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము* *పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.

Friday, 18 September 2026

రాధాష్టమి

ఓం శ్రీ కృష్ణ శరణం మమ
----------------------------------
*భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది*
*రాధామాధవం ఎంత రమణీయం ! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకుందుటకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.*
---------------------------------
*మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెన్నేలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.*
----------------------------------- *రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం* *నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.*
----------------------------------
*రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో - ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.*
----------------------------------
*గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.*
----------------------------------
*శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.*
---------------------------------
*శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.*
--------------------------------
*రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం' గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.*
----------------------------------
*వృషభానుడు, కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు - భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి' గా వ్యవహరిస్తారు.*
----------------------------------
*పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.*
--------------------------------
*రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం. రాధా కృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన. టీవీబీసీ*
------------------------------
*' రాధా ! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో ఏదైనా ఇస్తాను.'*
-------------------------------
*'మాధవా ! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా ?'*
-------------------------------
*'అవును రాధా!’*
--------------------------------
*'నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా ?'*
---------------------------------
*చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది.*
---------------------------------
*'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!’*
----------------------------------
*అదే బృందావనం. ఈ రోజు రాధాష్టమి. రాధ పుట్టిన రోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో, తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి, మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం, ఇటు మురళీగాన వినోదం, సరస శృంగార చక్రవర్తి,*
---------------------------------
*రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిణి మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది.*
------------------------------------
*కృష్ణా ! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా ! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు.*
----------------------------------
*నువ్వు నా అద్దానివా ? నన్ను నేను చూసుకుం టున్నానా ?'.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!’ ఆశ్చర్య చకితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు.*
----------------------------------
*'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా ! అన్నట్లు రాధా !* *నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా ! 'గలగలా నవ్వింది రాధ. 'నీకన్నా విలువైనది నేనే గోపాలా!’*
*హతాశుడయ్యాడు కృష్ణుడు ! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.*
----------------------------------
*'ఏమంటున్నావు రాధా ! నువ్వు నాకంటే విలువైనదానివా ? ఎలా ?'*
----------------------------------
*'భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!’*
---------------------------------
*'అవును'*
----------------------------------
*'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా'*
---------------------------------
*'నిజం'*
---------------------------------
*'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!’*
---------------------------------
*'అనుమానమెందుకు రాధా!’*
----------------------------------
*'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ'*
-----------------------------------
*'ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?'*
-----------------------------------
*'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'*
------------------------------------
*కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి ! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో.*
-----------------------------------
*కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది.*
--------------------------------
*కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది.*
----------------------------------
*వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు.*
-------------------------------
*'ఏ.. ఏమిటిది! మా.. మాధవా!’ రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది.*
---------------------------------
*'బానిస, యజమానికి నమస్కరించాలి కదా!’*
----------------------------------
*కృష్ణుని వినయ సౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది.*
------------------------------------ *రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.*
----------------------------------
*ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.*
------------------------------------
*యశోదా ప్రియసుతుడు, ఉదయ చంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.*
----------------------------------
*రాధాష్టమి శుభాకాంక్షలు..*
---------------------------------- *🙏🏻ఓం శ్రీ కృష్ణ శరణంమమ🙏🏻* *🙏🏻రాధేకృష్ణ 🙏🏻*
----------------------------------
*ప్రతి నామం ముందు "ఓం" చేర్చి పఠించవలెను.*
----------------------------------
*శ్రీరాధాయై నమః ।*
*శ్రీరాధికాయై నమః ।*
*కృష్ణవల్లభాయై నమః ।*
*కృష్ణసమ్యుక్తాయై నమః ।*
*వృన్దావనేశ్వర్యై నమః ।*
*కృష్ణప్రియాయై నమః ।*
*మదనమోహిన్యై నమః । శ్రీమత్యై నమః ।*
*కృష్ణకాన్తాయై నమః ।*
*కృష్ణానన్దప్రదాయిన్యై నమః । ౧౦ ।*

*యశస్విన్యై నమః ।*
*యశోదానన్దనవల్లభాయై నమః ।*
*త్రైలోక్యసున్దర్యై నమః ।*
*వృన్దావనవిహారిణ్యై నమః ।*
*వృషభానుసుతాయై నమః ।*
*హేమాఙ్గాయై నమః ।*
*ఉజ్జ్వలగాత్రికాయై నమః ।*
*శుభాఙ్గాయై నమః ।*
*విమలాఙ్గాయై నమః ।*
*విమలాయై నమః । ౨౦ ।*

*కృష్ణచన్ద్రప్రియాయై నమః ।*
*రాసప్రియాయై నమః ।*
*రాసాధిష్టాతృదేవతాయై నమః ।*
*రసికాయై నమః ।*
*రసికానన్దాయై నమః ।*
*రాసేశ్వర్యే నమః ।*
*రాసమణ్డలమధ్యస్థాయై నమః ।*
*రాసమణ్డలశోభితాయై నమః ।*
*రాసమణ్డలసేవ్యాయై నమః ।*
*రాసక్రిడామనోహర్యై నమః । ౩౦ ।*

*కృష్ణప్రేమపరాయణాయై నమః ।*
*వృన్దారణ్యప్రియాయై నమః ।*
*వృన్దావనవిలాసిన్యై నమః ।*
*తులస్యధిష్టాతృదేవ్యై నమః ।*
*కరుణార్ణవసమ్పూర్ణాయై నమః ।*
*మఙ్గలప్రదాయై నమః ।*
*కృష్ణభజనాశ్రితాయై నమః ।*
*గోవిన్దార్పితచిత్తాయై నమః ।*
*గోవిన్దప్రియకారిణ్యై నమః ।*
*రాసక్రీడాకర్యై నమః । ౪౦ ।*

*రాసవాసిన్యై నమః ।*
*రాససున్దర్యై నమః ।*
*గోకులత్వప్రదాయిన్యై నమః ।*
*కిశోరవల్లభాయై నమః ।*
*కాలిన్దీకులదీపికాయై నమః ।*
*ప్రేమప్రియాయై నమః ।*
*ప్రేమరూపాయై నమః ।*
*ప్రేమానన్దతరఙ్గిణ్యై నమః ।*
*ప్రేమధాత్ర్యై నమః ।*
*ప్రేమశక్తిమయ్యై నమః । ౫౦ ।*

*కృష్ణప్రేమవత్యై నమః ।*
*కృష్ణప్రేమతరఙ్గిణ్యై నమః ।*
*గౌరచన్ద్రాననాయై నమః ।*
*చన్ద్రగాత్ర్యై నమః ।*
*సుకోమలాయై నమః ।*
*రతివేషాయై నమః ।*
*రతిప్రియాయై నమః ।*
*కృష్ణరతాయై నమః ।*
*కృష్ణతోషణతత్పరాయై నమః ।*
*కృష్ణప్రేమవత్యై నమః । ౬౦ ।*

*కృష్ణభక్తాయై నమః ।*
*కృష్ణప్రియభక్తాయై నమః ।*
*కృష్ణక్రోడాయై నమః ।*
*ప్రేమరతామ్బికాయై నమః ।*
*కృష్ణప్రాణాయై నమః ।*
*కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః ।*
*కోటికన్దర్పలావణ్యాయై నమః ।*
*కన్దర్పకోటిసున్దర్యై నమః ।*
*లీలాలావణ్యమఙ్గలాయై నమః ।*
*కరుణార్ణవరూపిణ్యై నమః । ౭౦ ।*

*యమునాపారకౌతుకాయై నమః ।*
*కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః ।*
*గోపాఙ్గనావేష్టితాయై నమః ।*
*కృష్ణసఙ్కీర్తిన్యై నమః ।*
*రాససక్తాయై నమః ।*
*కృష్ణభాషాతివేగిన్యై నమః ।*
*కృష్ణరాగిణ్యై నమః ।*
*భావిన్యై నమః ।*
*కృష్ణభావనామోదాయై నమః ।*
*కృష్ణోన్మాదవిదాయిన్యై నమః । ౮౦ ।*

*కృష్ణార్తకుశలాయై నమః ।*
*పతివ్రతాయై నమః ।*
*మహాభావస్వరూపిణ్యై నమః ।*
*కృష్ణప్రేమకల్పలతాయై నమః ।*
*గోవిన్దనన్దిన్యై నమః ।*
*గోవిన్దమోహిన్యై నమః ।*
*గోవిన్దసర్వస్వాయై నమః ।*
*సర్వకాన్తాశిరోమణ్యై నమః ।*
*కృష్ణకాన్తాశిరోమణ్యై నమః ।*
*కృష్ణప్రాణధనాయై నమః । ౯౦ ।*

*కృష్ణప్రేమానన్దామృతసిన్ధవే నమః ।*
*ప్రేమచిన్తామణ్యై నమః ।*
*ప్రేమసాధ్యశిరోమణ్యై నమః ।*
*సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః ।*
*మహాభావచిన్తామణ్యై నమః ।*
*కారుణ్యామృతాయై నమః ।*
*తారుణ్యామృతాయై నమః ।*
*లావణ్యామృతాయై నమః ।*
*నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః ।*
*సౌన్దర్యకుఙ్కుమాయై నమః । ౧౦౦ ।*

*సఖీప్రణయచన్దనాయై నమః ।*
*గన్ధోన్మాదితమాధవాయై నమః ।*
*మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః ।*
*సఖీప్రణయితావశాయై నమః ।*
*కృష్ణప్రియావలీముఖ్యాయై నమః ।*
*ఆనన్దస్వరూపాయై నమః ।*
*రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః ।*
*ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః ।*
-----------------------------------
*ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం*
------------------------------------ *"రాధాయ నమః " మహా మంత్రం.*
---------------------------------
*అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలోపరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.*
----------------------------------
*రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.*
------------------------------------
*అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన*
*లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.*
----------------------------------
*గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.*
--------------------------------
*శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.*
-----------------------------------
*రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా* *మారుతుందని* *వరమిచ్చాడనీ ఆ గాథ* *సారాంశం. వృషభానుడు,*
*కళావతి దంపతులకు* *పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు.*
-----------------------------------
*బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.* *శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.*
*పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.*
----------------------------------
*రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.*
-----------------------------------
*రాధాకృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.*
----------------------------------
*భాగవతంలో పెద్దగా చర్చించని రాధాకృష్ణుల గురించి ఏ పురాణం వివరిస్తుంది?*
----------------------------------
*శ్రీకృష్ణుని అష్టమహిషులు ఉండగా ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం, వారి కీర్తనలు బహు ప్రచారంలో ఉండడం, ప్రేమైకస్వరూపంగా వారి గురించి చర్చించడం చూసాము. వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాధలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అనవసరమైన తప్పుడుకధలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి. ఎలాగైతే సూర్యునిగురించి ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా ఆయన ప్రభావానికి లోటు లేదో, రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివితక్కువ కధలకు విలువ ఇచ్చినా ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు.*
------------------------------------
*శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....*
----------------------------------
*1)దేవీభాగవతం:- నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని.*
-----------------------------------
*2)బ్రహ్మవైవర్తన పురాణం:- ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణ ఖండం. ఈ పురాణం అంతా రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండి ఉద్భవించినవే. స్త్రీతత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం. చైతన్యమహాప్రభు ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం. శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వ్రజభూమి లో వారి ఆటపాటలు వంటి ఎన్నో శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరింపబడ్డాయి. అమ్మవారి చైతన్య తత్త్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది.*
----------------------------------
*3)బ్రహ్మాండ పురాణం:- ఉపోద్ఘాతపర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతి దేవిని శాంతపరచడానికి రాధాసహిత కృష్ణుడు ప్రత్యక్షమై తన సహోదరిని ఊరడింప చేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహేరాధే వనే రాధే జగత్ప్రసిద్ధం.*
------------------------------------
*4)స్కాందపురాణం:- వైష్ణవఖండంలో భాగవతమహాత్మ్యం వర్ణనలోను, వాసుదేవ మహాత్మ్యంలోను శ్రీకృష్ణుని ఆత్మ గా రాధమ్మను కీర్తిస్తారు. దీనిలోనే గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి.* 
-----------------------------------
*5)నారదపురాణం:- నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి ఐదు వందల నామాలు రాధా కీర్తన. అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్శదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు.* 
-----------------------------------
*6)పద్మపురాణం:- భూమిఖండంలో రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరింపబడి ఉంటాయి. పాతాళఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలు, అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.* 
------------------------------------
*7)విష్ణుపురాణం:- 13.వ సర్గలో రాసలీల వివరణ రాధ యొక్క గొప్పదనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.*
------------------------------------
*8)గర్గ సంహిత:- దీనిలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్యప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు, అటుపై రాధ విరహవేదన, మరల సిద్ద్దాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.*
----------------------------------
*ఇవి కాక మత్స్యపురాణం లో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, ఋగ్వేదంలో రాధాసంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.* 
-----------------------------------
*ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదని అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి శ్యామసముద్రంలో (అంటే కృష్ణునిలో అంటే మోక్షం ) కలిసే అవకాశం ఉండదని పురాణం చెబుతుంది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం రాధ తత్త్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవడం. అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు.

Thursday, 3 September 2026

శ్రీ కృష్ణజన్మ అష్టమి

కృష్ణం_వందే_జగద్గురుం

 శ్రీ కృష్ణాష్టమి 

*శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో పది ప్రధానమైనవి కాగా, వాటిలో శ్రీకృష్ణుని అవతారం పరిపూర్ణావతారమని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ బహుళ అష్టమి రోజున, రోహిణీ నక్షత్రాన శ్రీకృష్ణుడు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. ఈ రోజును కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, జన్మాష్టమిగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదవదికాగా, ఆయన పుట్టిన తిథి కూడా ఎనిమిది కావటం, దేవకీ వసుదేవల అష్టమ గర్భంలో ఆయన జన్మించడం, ఆయనకు ఎనిమిదిమంది భార్యలు ఉండడం, ఇలా శ్రీకృష్ణుని గాధలో ఎనిమిదవ సంఖ్యకు ప్రాధాన్యం ఎంతో వుంది.*
---------------------------------
*వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్*
*దేవకీ పరమానందం కృష్ణం వందే జగదుర్గుమ్*
-----------------------------------
*ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణుని జగదుర్గువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. అద్వైతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామాను* *జాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో అధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలచి తరించారు. శ్రీకృష్ణుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ఆసాంతం ఆయన జీవితమంతా ఒక మహాప్రబోధం. మేనమామ కంసుని నుంచి మొదలుకొని దుర్యోధనాదులను వధింపజేయడం వరకూ ఆయన సాగించినదంతా దుష్టశిక్షణ. అది శిష్టులైన పాండవుల కోసమే. కలియుగంలో ధర్మం పూర్తిగా వినాశనం కాకుండా ఎన్ని ప్రబోధాలు అవసరమో అన్నింటినీ ఈ దేవదేవుడు మనకు అందించాడు. మరణం లేని మహాశక్తి స్వరూపం ఆ దేవ దేవునిది. భావ గతంలోని దశమ స్కంధం శ్రీకృష్ణలీలల సమాహారం అని చెప్పవచ్చు. ధర్మసం స్థాపనకు ఉద్భవించానని చెప్పిన కృష్ణ భగవానుడు మానవ జీవితానికి దిశా నిర్దేశం చేస్తూ భగవద్గీతని ప్రబోధించాడు. గీతాచార్యునిగా పూజలందుకుంటున్నాడు. నారదముని నుంచి ప్రేరణ పొందిన వేదవ్యాసుడు భక్తిరస ప్రధానమైన శ్రీకృష్ణచరిత్రను 'భాగవత పురాణం'గా రచించారు. అది భక్తి జ్ఞాన, వైరాగ్యాల సమ్మేళనం, పురాణాలన్నింటిలోకీ శ్రేష్టమైనదీ పరమ పవిత్రమైన భాగవతం. హైందవ పురాణ పురుషుల్లా శ్రీకృష్ణుడంతటి గొప్ప వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికీ ప్రజాపాలకులనబడే వారందరికీ ఆయన ప్రబోధించిన ధర్మమార్గమే శిరోధార్యం. అదే దుష్టశిక్షణ- శిష్టరక్షణ. శ్రీకృష్ణుడు తానే పరమాత్మనని కురుక్షేత్ర సంగ్రామ వేళ అస్త్ర సన్యాసం: చేసిన అర్జునునికి 'భగవద్గీత'ను ఉపదేశిస్తూ పేర్కొన్నాడు. అంతటితో ఆగక, ప్రత్యక్ష సాక్ష్యాధారంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణుడని, కాబట్టి కృష్ణతత్వమంటే పరమాత్మ తత్వమని వేరే చెప్పక్కర్లేదు. దశావతారాల పరమార్దం కూడా ఇదే, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ వేళ ఉద్భవించిన శ్రీకృష్ణుని 'భగవద్గీత' మహాప్రవచనం మరో సందేశం. కర్తవ్యం నుంచి దూరంగా జరిగే మనిషి ఏ సమయంలో బోధ చేస్తే వింటాడో పరమాత్మకు తెలుసు. కర్తవ్యం విడిచి వెడితే జాతి క్షమించదన్నాడు. కర్మాచరణమే నిజమైన సన్యాసమని తెలిపాడు.*
----------------------------------
*శ్రీకృష్ణుని లీలలు*
-----------------------------------
*ఏ అవతారంలోనూ కనిపించని ఎన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో కన్పిస్తాయి. ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవితాన్ని గడుపుతూ ధర్మసంస్థాపన చేయడం. సర్వం తెలిసినవాడైనా ఏమీ తెలియనివాడిలా లీలా మానుష విగ్రహుడిగా తన లీలలతో జగన్నాటకాన్ని నడపడం, బాలకృష్ణుడిగా చిలిపి చేష్టలతో అందరి హృదయాలలో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోవడం, 'మన్ను తిన్నావా?' అని అడిగిన యశోద మ్మకు నోటిలోనే పదునాలుగు భువనాలను చూపిస్తూ తల్లికి ఆత్మబోధ చేశాడు. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ' అనే భగవద్గీతా శ్లోకానికి పర మాత్మ అప్పుడే ఆచరణాత్మకంగా అర్థాన్ని ప్రకటించాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకోవడం, పరమాత్మ పిలుపునందుకున్న వారంతా గోవర్ధన పర్వత ఛాయలో చేరుకోవడం నిజంగా ఆశ్చర్యమే. కంసుడిని మేన మామ అని చూడకుండా వధించి లోక సంరక్షణ విషయంలో బంధుత్వాలు పనికిరావని బోధించాడు. శకటాసుర, తృణావర్త తదితర రాక్షససంహారం, కాళీయ మర్దనం, శిశుపాల దంతవక్త్రుల సంహారం- ఇలా ప్రతి ఘట్టంలోనూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశాడు పరమాత్మ. నిండుగా నీళ్లతో పారుతూ అలనాటి కృష్ణుని రాసక్రీడలకు సాక్షిగా దర్శనమిస్తుంది యమునానది. మధుర భక్తికి మూలం రాధాదేవి. ఒకప్రక్క వెన్నదొంగగా గోపెమ్మలను అరడి పెడతాడు, ఇంకొక పక్క చీరలు దొంగిలించి గోపికలకు తత్వోపదేశం కావిస్తాడు. ఇలా ఎన్నో వింతలు! ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే వుంటుంది. అదే ఆ చిన్నికృష్ణునిలోని మహిమ, కృష్ణా! ముకుందా! మురారి! జయగోవిందా! బృందావిహారి! అంటూ ప్రేమతో ధ్యానిస్తే, కీర్తిస్తే ఆ జగద్గురువు అనుగ్రహం వెంటనే లభ్యమౌతుంది. అందుకు మధుర భక్తిమార్గాన్ని ఎంచుకుని ఆరాధించటానికి కృష్ణాష్టమే మంచి రోజు.*
------------------------------------
*బృందావనం వేదికగా*
------------------------------------
*శ్రీకృష్ణభగవానుని బాల్యక్రీడలకు, లీలా విన్యాసాలకు వేదిక బృందావనం. రాధాకృష్ణుల మధుర ప్రేమకు, రసరమ్య రాసక్రీడకు సాక్ష్యమిస్తుంది. స్థానికులు వృందావనం అంటారు. తులసికి వృంద అనే పేరుంది. గోకులం ఎంచుకుని నివసించిన ప్రాంతం కాబట్టి ప్రజభూమి అన్నారు. బృందావనం యమునా నది తీరంలో వుంది. ఇక్కడే యమునా తీరంలో 32 స్నాన ఘట్టాలున్నాయి. ఇక్కడే ప్రతీ స్నానఘట్టం శ్రీకృష్ణ నగవానుని బాల్య క్రీడలలో ముడి వడి అత్యంత పవిత్రమైనదని భావించి ఇక్కడ భక్తులు స్నానం చేస్తారు. శ్రీకృ ష్ణుడికి ఎనిమిది మంది రాణులున్నారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజిత, భద్రమనువు, లక్షణ- వారంతా శ్రీకృష్ణుని కోసం తపించి ఆయన్ను భర్తగా పొందారు. స్వపర భేదాలు లేని ధర్మమూర్తి, యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. కర్మను ఈశ్వరార్పణంగా ఆచరించడమే సిద్ధికి హేతువనేది భగవద్గీత సారం. శ్రీకృష్ణపరమాత్మ చూపించింది లీలలు మాత్రమే కాదు అందించిన కర్తవ్య బోధ అవశ్యం అనుసరణీయం.*
---------------------------------
*కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి*
----------------------------------
*చేతితో పాదాన్ని నోట్లో పెట్టుకుని, రావి ఆకు దొప్పలో పడుకుని వున్న బాలకృష్ణుని మనసారాస్మరిస్తున్నాను. లీలాశుకుడు రచించిన శ్రీకృష్ణకర్ణామృతంలో బాల ముకుందాష్టకం తొలి శ్లోకమిది.*
-----------------------------------
*ధర్మ సంస్థాపన కొరకు*
------------------------------------
*లోకంలో అధర్మం ప్రబలినపుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతియుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో అధర్మం పెచ్చుమీరినకాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్ధించగా, శ్రీమహావిష్ణువు దేవకీ వసుదేవుకు జన్మించ సంకల్పించాడు. అపుడు మధురానగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించే వాడు. వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయస్సురావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే 'దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు' అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినపుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భంవల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీదేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు అర్థరాత్రి వేళ రోహిణి నక్షత్రమున్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమున నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి దారినిస్తుంది. వ్రేపల్లెలోని తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద ప్రక్కన శిశువుని విడిచి ఆమె ప్రక్క నిద్రిస్తున్న శిశువుని ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు. హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువుని చంపడానికి పైకి విసిరి కొడతాడు. అయితే ఆ శిశువు ఆకాశమార్గాన కెగసి, తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. దేవకి గర్భాన పుట్టినవాడు ఎక్కడ వున్నా వెతికి వాడిని చంపాలంటూ తన వద్ద నున్న రాక్షసులను పురమాయిస్తాడు. గోకులానికి వచ్చిన పూతనను, శకటాసురుడిని మొదలగువారిని బాల్యంలోనే చంపేశాడు. చెడ్డవారిని దండించి మంచి వారిని కాపాడి ధర్మాన్ని నిలబెట్టడమే నా పని- రాజ్యాలు పాలించటం కాదు. అని కృష్ణుడు ప్రకటించాడు. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. శ్రీకృ పరమాత్మ ధర్మపరులైన పాండవులకు సహాయంగా ఉండి చెడ్డవారందరినీ శిక్షించాడు.*
---------------------------------
*"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే".*
--------------------------------                         *🙏🏻జై శ్రీ కృష్ణ🙏🏻*
--------------------------------
*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*
----------------------------------
 *కృష్ణం వందే జగద్గురుం* 
-----------------------------------
*1)శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు*
*2)పుట్టిన తేది సాధారణ పూర్వ శకం 18.07.3228 (3228 B.C.E)*
*3)మాసం : శ్రావణం*
*4)తిథి: అష్టమి*
*5)నక్షత్రం : రోహిణి*
*6)వారం : బుధవారం*
*7)సమయం : రాత్రి గం.00.00 ని.* 
*8)జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు*
*9)నిర్యాణం: సాధారణ పూర్వ శకం 18.02.3102(3102 B.C.E)*
*10)శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది*
*11)కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం*
*12)కురుక్షేత్రం సాధారణ పూర్వ శకం 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. సాధారణ పూర్వ శకం (B.C.E) 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.*
*13)భీష్ముడు సాధారణ పూర్వ శకం. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.*
*14)శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:*
*మధురలో కన్నయ్య*
*ఒడిశాలో జగన్నాధ్*
*మహారాష్ట్ర లో విఠల (విఠోబ)*
*రాజస్తాన్ లో* *శ్రీనాధుడు*
*గుజరాత్ లో* *ద్వారకాదీసుడు & రాంచ్చోడ్*
*ఉడిపి, కర్ణాటకలో కృష్ణ*
*15)జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు*
*16)జన్మనిచ్చిన తల్లి దేవకీ*
*17)పెంచిన తండ్రి నందుడు*
*18)పెంచిన తల్లి యశోద*
*19)సోదరుడు బలరాముడు*
*20)సోదరి సుభద్ర*
*21)జన్మ స్థలం మధుర*
*22)భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ*
*23)శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు* *సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు*
*కంసుడు - మేనమామ*
*శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు.*
*24)శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.*
*25)శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.* 
*26)కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.*
*27)14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.*
*28)తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.*
*29)కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.*
*30)వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.*
*31)శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.*
*32)అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.*
*33)గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.*
*34)తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.*
*35)పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.*
*36)ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపడెను.*
*37)రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.*
*38)పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.*
*39)ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.*
*40)అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.*
*41)శ్రీకృష్ణుడు  జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.*
*43)జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.*
*అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.)*
*44)శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.*

Sunday, 23 August 2026

నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి

 శ్రీ పద్మావతీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం – నారాయణవనం* 
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సాధారణ వైష్ణవ ఆలయం మాత్రమే కాదు. శ్రీనివాసుడు–పద్మావతి అమ్మవారి దివ్య వివాహం జరిగిన పవిత్ర కల్యాణ క్షేత్రంగా భక్తులు విశ్వసించే అత్యంత ప్రాచీన పుణ్యస్థలం. తిరుమలలో స్వామివారు జగద్రక్షకుడిగా దర్శనమిస్తే, నారాయణవనంలో కల్యాణమూర్తిగా, నూతన వరుడి రూపంలో భక్తులను అనుగ్రహించడం ఈ క్షేత్రపు ప్రధాన విశిష్టత.
నారాయణవనం అనే పేరు ఎలా వచ్చింది?
పురాణకాలంలో ఈ ప్రాంతం తుండీర మండలం పరిధిలో ఉండేదని స్థలపురాణం తెలియజేస్తోంది. ఆకాశరాజు నారాయణవనాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. శ్రీమహావిష్ణువు నారాయణుడి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడే పద్మావతి దేవిని వివాహం చేసుకున్న కారణంగా ఈ ప్రాంతానికి “నారాయణవనం” అనే పేరు స్థిరపడిందని భక్తుల విశ్వాసం.
పద్మావతి అమ్మవారి ఆవిర్భావం
ఆకాశరాజు దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం నిర్వహించాలని ఆకాశరాజు సంకల్పించారు. యాగశాల నిర్మాణానికి భూమిని నాగలితో దున్నుతుండగా, పద్మంలో పవళించి ఉన్న ఒక దివ్య బాలిక కనిపించిందని స్థలపురాణం చెబుతోంది.
పద్మంలో లభించిన బాలిక కావడంతో ఆమెకు “పద్మావతి” అని నామకరణం చేశారు. ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఆమెను తమ కన్నబిడ్డగా ఎంతో ప్రేమతో పెంచారు. పద్మావతి దేవి స్వయంగా మహాలక్ష్మి అవతారమని భక్తుల విశ్వాసం.
శ్రీనివాసుడు–పద్మావతి దేవి తొలి దర్శనం
ఒకరోజు తిరుమలలో నివసిస్తున్న శ్రీనివాసుడు వేటకు బయలుదేరారు. ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ నారాయణవనం ప్రాంతానికి వచ్చారు. అక్కడి రాజ ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతి దేవిని చూసి, ఆమెను వివాహం చేసుకోవాలని సంకల్పించారు.
తరువాత వకుళమాత ద్వారా ఆకాశరాజు దంపతులకు వివాహ ప్రతిపాదన పంపించారని పురాణకథనం. జ్యోతిషులు, పురోహితులు ఈ సంబంధం దైవనిర్ణయమని తెలియజేయడంతో ఆకాశరాజు దంపతులు సంతోషంగా అంగీకరించారు.
దివ్య కల్యాణ మహోత్సవం
విళంబి నామ సంవత్సరంలో, వైశాఖ మాసం, శుక్లపక్ష దశమి, శుక్రవారం నాడు శ్రీనివాసుడు–పద్మావతి దేవి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు స్థలపురాణం పేర్కొంటోంది.
బ్రహ్మ, రుద్రుడు, ఇతర దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఈ దివ్య కల్యాణానికి హాజరయ్యారని పురాణకథనం. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీ దేవిని శ్రీనివాసుడికి సాలంకృత కన్యాదానం చేశారు. వేదమంత్రాల మధ్య పాణిగ్రహణం జరగడంతో నారాయణవనం భూలోకంలోని పవిత్ర కల్యాణ వేదికగా ప్రసిద్ధి చెందింది.
ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని “శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి” అని పిలుస్తారు.
మూలవిరాట్టు విశిష్టత
ఇక్కడి స్వామివారి దివ్యమంగళ విగ్రహంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి.
స్వామివారి కుడిచేతికి కల్యాణ కంకణం కనిపిస్తుంది. ఇది పద్మావతి అమ్మవారితో జరిగిన దివ్య వివాహానికి గుర్తుగా భావిస్తారు.
స్వామివారి నడుమున దశావతార వడ్డాణం ఉంటుంది. దీనిపై మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన ఆకృతులు ఉంటాయని చెబుతారు.
వేటకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసే విధంగా స్వామివారి వద్ద ఖడ్గం దర్శనమిస్తుంది.
స్వామివారు నేత్రదర్శనంతో భక్తులను అనుగ్రహిస్తున్నట్లు కనిపించడం మరో విశేషం.
స్వామివారి రూపం నూతన వరుడి రూపాన్ని తలపిస్తూ, కల్యాణ సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళమూర్తిగా దర్శనమిస్తుంది.
తిరుమల శ్రీవారికి పలు అలంకారాల కారణంగా కొన్ని ప్రత్యేక చిహ్నాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. నారాయణవనంలోని స్వామివారి రూపంలో మాత్రం కల్యాణ కంకణం, దశావతార వడ్డాణం, ఖడ్గం వంటి విశేషాలను దర్శించగలగడం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
వివాహం కానివారికి కల్యాణప్రాప్తి
వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే వివాహ అవరోధాలు తొలగి, మంచి సంబంధం కుదురుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇప్పటికే వివాహమైన దంపతులు దర్శించుకుంటే:
దాంపత్య అన్యోన్యత పెరుగుతుందని,
కుటుంబ కలహాలు తొలగుతాయని,
సంతాన సౌభాగ్యం కలుగుతుందని,
కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.
అందువల్ల నూతన వధూవరులు, వివాహం కావలసిన యువతీ యువకులు, దాంపత్య సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులు ఈ క్షేత్రాన్ని భక్తిశ్రద్ధలతో దర్శిస్తుంటారు.
వైఖానస ఆగమ సంప్రదాయం
ఆలయంలో పూజలు వైఖానస ఆగమ విధానం ప్రకారం నిర్వహిస్తారు. వైఖానస ఆగమం అనేది విష్ణు ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ, నిత్యపూజలు, నివేదనలు, ఉత్సవాలు, అలంకరణలు ఎలా నిర్వహించాలో నిర్దేశించే ప్రాచీన వైదిక సంప్రదాయం.
ఇక్కడ నిత్య, నైమిత్తిక, విశేష కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి.
నిత్య కైంకర్యాలు: ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం, అర్చన, నివేదన, హారతి తదితర సేవలు.
నైమిత్తిక కైంకర్యాలు: ప్రత్యేక తిథులు, నక్షత్రాలు, పర్వదినాల్లో జరిగే పూజలు.
విశేష కైంకర్యాలు: బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, కల్యాణోత్సవం వంటి మహోత్సవాలు.
ఆలయ నిర్మాణం, నిర్వహణ
స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు–పద్మావతి దేవి వివాహానంతరం ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించి, స్వామివారిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.
కాలక్రమంలో ఈ ఆలయం:
కార్వేటినగరం సంస్థానాధీశుల పాలనలో,
తిరుత్తణి ఆలయ నిర్వహణలో,
దేవాదాయశాఖ ధర్మకర్తల మండలి పాలనలో కొనసాగింది.
తరువాత 1967 ఏప్రిల్ 29వ తేదీన ఆలయ నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించారు. అప్పటి నుంచి టీటీడీ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలు, నిత్యపూజలు, వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నారాయణవనం ఆలయం టీటీడీ పరిధిలోని ప్రముఖ అనుబంధ ఆలయాలలో ఒకటిగా కొనసాగుతోంది. టీటీడీ అధికారిక ఆలయ సమాచారం⁠�
“ఐహిక–ఆముష్మిక ఫలాలు” అంటే ఏమిటి?
స్థలపురాణంలో పేర్కొన్న ఐహిక ఫలాలు అంటే ఈ లోక జీవితంలో కలిగే వివాహం, సంతానం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సంపద, మనశ్శాంతి వంటి శుభఫలాలు.
ఆముష్మిక ఫలాలు అంటే ఆధ్యాత్మిక పురోగతి, పుణ్యం, భగవంతునిపై భక్తి, అంతరంగ శాంతి, మోక్షమార్గానికి సంబంధించిన ఫలాలు.
అందువల్ల ఈ స్వామివారిని దర్శించే భక్తులు ప్రాపంచిక శుభఫలాలతోపాటు ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని కూడా పొందుతారని క్షేత్ర మహిమ చెబుతోంది.
ఈ క్షేత్రం అందించే ఆధ్యాత్మిక సందేశం
నారాయణవనం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుని వివాహం అంటే కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు. శ్రీనివాసుడు పరమాత్మకు, పద్మావతి దేవి జీవాత్మకు ప్రతీకలుగా భావిస్తే—వారి కల్యాణం జీవాత్మ పరమాత్మను చేరుకునే దివ్య ఘట్టంగా కనిపిస్తుంది.
అందుకే నారాయణవనం దర్శనం కేవలం ఒక ఆలయ సందర్శన కాదు. శ్రీనివాసుడు–పద్మావతి అమ్మవారి ప్రేమ, దైవసంకల్పం, వివాహ ధర్మం, దాంపత్య పవిత్రతను స్మరింపజేసే ఆధ్యాత్మిక అనుభూతి.
తిరుమలలో శ్రీనివాసుని దర్శించే భక్తుడు—నారాయణవనంలో ఆయన దివ్య కల్యాణ ఘట్టాన్ని స్మరించుకుంటే ఆ యాత్ర మరింత పరిపూర్ణమవుతుంది.

Thursday, 20 August 2026

వరలక్ష్మి వ్రతం

 *వరలక్ష్మీ వ్రతకల్పమువరలక్ష్మీ వ్రతం
- *పూజా సామగ్రి:
పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).
-----------------------------------
అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము లేక ఫోటో
-----------------------------------
*పంచామృతములు:-* ------------------------------------ ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార
-----------------------------------
*తోరము:-* ------------------------------------ తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.
-----------------------------------
పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
------------------------------------
*పూజావిధానం:-*
------------------------------------
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
-----------------------------------
దీపము వెలిగించాలి.
-----------------------------------
*ఆచమ్య:-*
------------------------------------
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..
------------------------------------
శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!
------------------------------------
(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)
మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......సంవత్సరే ....ఆయనే.....ఋతౌ...మాసే.....పక్షే....తిథౌ.....వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!
----------------------------------
అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.
------------------------------------
శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!
ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!
-----------------------------------
(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)
---------------------------------
కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!
----------------------------------
(అని ప్రార్థిమ్చి దేవునిపై పుష్పము నుంచవలెను)
-----------------------------------
*అథ ధ్యానమ్:-*
------------------------------------
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!
----------------------------------
*ఆవాహనం:-*
-----------------------------------
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!
----------------------------------
*ఆసనమ్:-*
-----------------------------------
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.
-----------------------------------
*పాద్యమ్:-*
-----------------------------------
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!
----------------------------------
*అర్ఘ్యమ్:-*
-----------------------------------
శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!
-----------------------------------
*ఆచమనీయం:-*
-----------------------------------
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!
గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి
----------------------------------
*పంచామృత స్నానం:-*
-----------------------------------
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి
----------------------------------
*శుద్ధోదక స్నానం:-*
----------------------------------
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి
----------------------------------
*వస్త్రం:-*
-----------------------------------
సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి
-----------------------------------
*యజ్ఞోపవీతం:-*
-----------------------------------
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి
-----------------------------------
*గంధం:-*
------------------------------------
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి
----------------------------------
*అక్షతలు:-*
-----------------------------------
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి
------------------------------------
*ఆభరణం:-*
------------------------------------
కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి
----------------------------------
*పుష్పం:-*
----------------------------------
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి
-----------------------------------
అథాంగపూజా!
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః జానునీ పూజయామి
ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి
ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి
ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి
ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే
అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.
------------------------------------
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
------------------------------------
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
------------------------------------
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
----------------------------------
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
------------------------------------
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
-----------------------------------
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
----------------------------------
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
------------------------------------
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
------------------------------------
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
------------------------------------
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
-----------------------------------
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
-----------------------------------
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
----------------------------------
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
----------------------------------
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి
--------------------------------
అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను
--------------------------------
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి
----------------------------------
(దీపము చూపవలెను)
-----------------------------------
నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!
-------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి
--------------------------------
నివేదనము చేసి నీటిని వదలవలెను.
---------------------------------
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!
---------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి
----------------------------------
నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!
------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి
పుష్పము అక్షతలు ఉంచవలెను
------------------------------
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
--------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి
---------------------------------
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!
నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!
---------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి
---------------------------------
తోరగ్రంథి పూజా!
---------------------------------
ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి
వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి
వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి
-----------------------------------
ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.
------------------------------------
శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

వరలక్ష్మీ వ్రత కథ
సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.
------------------------------------
చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.
--------------------------------
*వాయన దానము:-*
--------------------------------
శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!
---------------------------------
శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!

Tuesday, 12 May 2026

శ్రీ హనుమ జయంతి వేడుకలు

శ్రీ హనుమాన్ జన్మోత్సవo, మే,12 తేదీ (జయంతి కాదు) వస్తున్నదనీ అందరికీ ముకుళిత హస్తాలతో నేను ఒక ప్రత్యేక విన్నపం చేస్తున్నాను 🙏🏻* ************************* *మనము అందరము దీనిని జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవo అని పిలవమని అందరిని ప్రోత్సహించండి ఎందుకంటే ఈ లోకంలో లేని వారికి జయంతి జరుపుకుంటారు మరియు కలియుగంలో కేవలం శ్రీరామ భక్తుడు హనుమ మాత్రమే చిరంజీవి నేటికీ ఉనికి లో ఉన్నారు కావున మనం తప్పక ఈ మార్పును తీసుకురావాలి మరియు ఈ సందేశం శ్రీ హనుమాన్ జన్మోత్సవo గురువారం(12 /05/26) లోపల అందరికీ చేరాలా నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను ఈ సందేశాన్ని కనీసం మీ గ్రూపులలో పంపండి*
************************* *జై శ్రీరామ్ జై జై శ్రీరామ్* *హనుమాన్ జన్మోత్సవo*
  ---------------------------------- *ఆంజనేయమంగళాష్టకం* 
**********************
*వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |*
*పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ ||*
*************************
*కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |*
*మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ ||*
*************************
*సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |*
*ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ ||*
************************
*దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |*
*తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ ||*
*************************
*భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |*
*జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ ||*
*************************
*పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే |*
*సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ౬ ||*
*************************
*రంభావనవిహారాయ గంధమాదనవాసినే |*
*సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ౭ ||*
*************************
*పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |*
*కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ౮ ||*
*************************
*కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |*
*వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే* 
--------------------------------------
*🙏🏻శ్రీరామ భక్త హనుమాన్ కి జై* *🙏🏻రేపు శ్రీ హనుమాన్ జన్మోత్సవo🙏🏻*
*************************
*హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి.* *ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు ,* *ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.*
*************************
*జననం*
*************************
*పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.*
*************************
*హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.* 
*************************
*అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.*
*************************
*అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.*
*************************
*ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.*
*************************
*ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.*
*************************
*ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.*
*************************
*భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.*
*************************
*హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.*
************************
*జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.*   
************************* *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*
*************************
*హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.*
*************************
*1)ప్రసన్నాంజనేయస్వామి*
*2)వీరాంజనేయస్వామి*
*3)వింశతిభుజాంజనేయ స్వామి*
*4)పంచముఖాంజనేయ స్వామి*
*5)అష్టాదశ భుజాంజనేయస్వామి*
*6)సువర్చలాంజనేయ స్వామి*
*7)చతుర్భుజాంజనేయ స్వామి*
*8) ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి*
*9)వానరాకార ఆంజనేయస్వామి*
*తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!*
*************************
*దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.*
*************************
*ఆయన అష్టసిద్ధులు*
*************************
*1)అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి*
*************************
*2)మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి*
*************************
*3)లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి*
************************* *4)గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి*
*************************
*5)ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి*
*************************
*6)పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి*
*************************
*7)వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి*
*************************
*8)ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి*
*************************
*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి* ?
*************************
*హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి.* *'ప్రదక్షిణ , నమస్కారాన్, సాష్టాంగాన్, పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.*
*************************
*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*
*************************
*శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం*
*తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం*
*************************
*శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన*
*శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||*
*************************
*అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి*
*************************
*''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''*
*************************
*అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.*
*************************
*ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.*
*************************
*అభిషేకం*
*************************
*పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.*
*************************
*ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి*
*************************
*మంగళ వార సేవ*
*************************
*మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.*
************************ *శనివార సేవ*
*************************
*హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.*
*************************
*పంచ సంఖ్య*
*************************
*హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.*
*************************
*హనుమత్ జన్మోత్సవం*
*************************
*హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమత్ జన్మో త్సవం కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జన్మోత్సవం జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.*
*************************
*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*
*************************
*ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జన్మోత్సవం నాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.* ************************ *🙏🏻ఆంజనేయుని కుమారుడు🙏🏻* --------------------------------------
*మకరధ్వజుడు*
*************************
*హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు*
*భావిస్తారు .... కానీ ఆయనకే తెలియకుండా,* *హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ... ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది ... శ్రీరాముని* *దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు* *హనుమంతుడు , కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా...*
*అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు ... నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం* *లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు .... హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది ....*
*అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ....*
*ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు ....* *కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది.... మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను* *మోసుకుపోతారు అతని భటులు .... కానీ ఆమె*
*పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో*
*మునిగిపోతారు .... జలకన్య గర్భాన శక్తిమంతమైన*
*ఓ జీవి వారికి కనిపిస్తుంది .... సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజురడు అని పేరు పెడతాడు*
*మైరావణుడు .... అంతేకాదు ! అతని శక్తిని*
*గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా* *నియమిస్తాడు .... రోజులు గడుస్తున్నాయి ...* *రామరావణుల మధ్య రాయబారాలు*
*బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది ... యుద్ధం జరుగుతున్న కొద్దీ* *రామలక్ష్మణులది పైచేయి* 
*కాసాగింది ....దీంతో* *కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు* *పంపాడు ....ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను* *పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ*
*అర్థించాడు .....రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు ...వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు .....ఈలోగా రామలక్ష్మణుల జాడ* *తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు ... అక్కడ మకరధ్వజునితో* *హనుమంతుడు* *తలపడాల్సిన సందర్భం*
*ఏర్పడుతుంది ....* *మకరధ్వజుని* *బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు ....దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు* *హనుమంతుడు .... ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు .....* *అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు ....*
*కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు* *మకరధ్వజుడు .... తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు ....*
*తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు .... సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు .... ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు ....* *హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి* *లంకకేగుతారు .....*
*ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు ..... వారు పాలించిన రాజస్థాన్‌,* *గుజరాత్‌ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా !*
*రాజస్థాన్‌లోని* 
 *అజ్మీర్‌కు దగ్గరలో,*
 *గుజరాత్‌లోని*
  *ద్వారకలో*
*మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు.*
*************************
*తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం ! ఇదీ మకరధ్వజుని వృత్తాంతం !.. స్వస్తీ ... !!* ************************* *రేపు హనుమాన్ జన్మోత్సవం* *************************
*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*
*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*
*************************
*హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి.* *ఇందులో హనుమాన్ (జన్మోత్సవం) ముఖ్యమైన పండుగ. సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు,రేపు, మే , 12 , గురువారం ఊరూరా, వాడవాడనా యావత్ దేశవ్యాప్తంగా వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి.*
*హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్ర లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవనీ పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు.*
********************
*మరికొందరు వైశాఖమాసం దశమినాడు ( రేపు మే 22) హనుమజ్జయంతిని జరుపుకుంటారు.*
*************************
*ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో నిర్వహిస్తారు.*
*************************
*నిజానికి పురాణాల ప్రకారం*
*************************
*హనుమాన్ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు.*
*కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం* *అని పిలవడం హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా* 
*పిలుస్తారు.* ************************ *🙏🏻హనుమ లాంగూల స్తోత్రం🙏🏻*
*************************
*శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|*
*చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|*
*రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|*
*త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||*
*కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|*
*ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|*
*ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|*
*సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||*
*************************
*🙏🏻శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🙏🏻*
*************************
*శ్రీరామ జయరామ జయజయరామ*
*************************
*మాణిక్యం*
************************
*తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |*
*ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ౧*
*************************
*ముత్యం*
*************************
*యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |*
*స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ౨*
************************* *ప్రవాలం*
*************************
*అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |*
*అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ౩*
*************************
 *మరకతం*
*************************
*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*
*దేవ్యె చ తస్యై జనకాత్మజాయై* 
*నమోస్తు* *రుద్రేంద్రయమానిలేభ్యః*
  *నమోస్తు* *చంద్రార్కమరుద్గణేభ్యః ౪*
*************************
*పుష్యరాగం*
*************************
*ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |*
*తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ ౫* 
*************************
*హీరకం*
*************************
*రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |*
*రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ౬*
************************* *ఇంద్రనీలం*
*************************
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |*
*దాసోఒహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |* 
*హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ౭* 
*************************
 *గోమేధికం*
*************************
*యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |*
*యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ౮*
*************************
*వైడూర్యం*
*************************
*నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |* 
*అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ౯* 
*************************
*🙏🏻ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్🙏🏻 --------------------------🙏🏻హనుమాన్ సర్వస్వం🙏🏻*
-------------------------------------
*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు*
------------------------------------ *1) శ్రీ హనుమంతుని తల్లపేరు?*  
*జవాబు : అంజనా దేవి! --------------------------- 2) హనుమంతుని తండ్రి పేరు?*  
*జవాబు : కేసరి !* -------------------------------- *3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?*---
*జవాబు : కశ్యపుడు !*  
----------------------------------- *4) అంజన పూర్వ జన్మలో ఎవరు?*
*జవాబు : సాధ్య !* ----------------------------------- *5) హనుమంతుని జన్మ తిథి ఏది?*
*జవాబు : వైశాఖ బహుళ దశమి!*
-----------------------------------       
 *6) హనుమంతుని జన్మ స్థలం ఏది?*
*జవాబు: తిరుమల ,అంజనాద్రి --------------------------- 7) హనుమంతుని నక్షత్రము ?*
*జవాబు :పూర్వాభాద్ర నక్షత్రం ----------------------- 8) హనుమంతుని జనన లగ్నం ?*
*జవాబు : కర్కటక ----------------------- 9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?*
*జవాబు : వైదృవీయోగం లో*
-------------------------------------- *10)హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?*
*జవాబు : ఈశ్వరాంశ*
-----------------------------------       
*11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?* *జవాబు : వాయుదేవుని