Tuesday, 19 December 2023

కాలభైరవాష్టకం

_*కాలభైరవాష్టకం*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౧ 
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౨ 
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౩ 
 భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౪ 
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౫ 
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౬ 
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౭
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౮ 
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

*ఇప్పుడు తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం పఠించండి.*

*తరువాత శ్రీ రుద్ర కవచం పఠించండి.*
 _*తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్నప్పుడు , జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు , అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు , అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు , కుజ దోషం , సర్ప దోషం , నాగదోషం , కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు -*
*ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై , సర్వ దోషాలనుండి మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది.* దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాలనాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి - ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక.....
*తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ ! 
సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరం చంద్రబింబమ్ ! 
దందందం దీర్ఘకాయం వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమం కరాళమ్ ! 
పంపంపం పాప నాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((1))
రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్షణదంష్ట్రాకరాళమ్ ! 
ఘంఘంఘం ఘోషఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ ! 
కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితం జ్వాలితం కామదే హమ్ ! 
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((2))
లంలంలం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వాకరాలం ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరం భీమరూపమ్ ! 
రుంరుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్ ! 
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((3))
వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరం తమ్ ! 
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ! 
చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితం భూమిచక్రమ్ ! 
మంమంమం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((4))
శంశంశం శంఖహస్తం శశికర ధవళం మోక్షసంపూర్ణతేజం ! 
మంమంమంమం మహంతం కులమకుళకులం మంత్ర గుప్తం సునిత్యమ్ ! 
యంయంయం భూతనాధం కిలికిలికిలితం బాలకేళిప్రధానమ్ ! 
అంఅంఅం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్!! ((5))
ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ ! 
క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనం తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదం ప్రకటిత గహనం గర్జితైర్భుమికంపమ్ ! 
వంవంవం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((6))
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్ ! 
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం ! 
ఐoఐoఐo ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపమ్ ! 
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((7))
హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ ! 
ధంధంధంధం నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ ! 
టంటంటంటంకార నాదం త్రిదశల టలటం కామగర్వాపహారమ్ ! 
భ్రూoభ్రూoభ్రూo భూతనాధం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((8))
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతాం భైరవస్యాష్టకమ్ ! 
యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహాణం డాకీనీ శాకీనీనామ్ ! 
నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్ ! 
సర్వానశ్వంతి దూరం విపద ఇతి భ్రుశం చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9)
భైరవస్యాష్టకమిదం శాన్మాసం యఃపఠ్ న్నర్ర: ! 
స యాతి పరమం స్థానం యంత్ర దేవో మహేశ్వరః !!
(10)
సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11)
*ఇతితీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం* *సంపూర్ణం*

*శ్రీ రుద్ర కవచం*

ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా హ్రాం బీజం శ్రీం శక్తిః హ్రీం కీలకం మమ మనసోఽభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః
హ్రామిత్యాది షడ్బీజైః షడంగన్యాసః ||
ధ్యానం |
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం |
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం |
నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే |
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||
 
దూర్వాస ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం |
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం ౧ 

రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా ౨ 

రుద్రో మే జాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా |
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః ౩ 

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయాం సదాశివః ౪ 

వాగీశః పాతు మే జిహ్వాం ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూన్-శ్చైవ పినాకధృత్ ౫ 

హృదయం మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్తనాంతరం |
నాభిం కటిం చ వక్షశ్చ పాతు సర్వం ఉమాపతిః ౬
బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథా క్రమమ్ ౭ 

వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా |
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః ౮ 

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే |
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతు మాం ౯ 

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మాం వృషభధ్వజ ౧౦ 

ఇత్యేతద్ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితం ౧౧ 

మమాఖ్యాతం సమాసేన న భయం తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమాఽరోగ్యం పుణ్యమాయుష్యవర్ధనమ్ ౧౨ 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ ౧౩ 

అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ ౧౪ 

త్రాహిమాం పార్వతీనాథ త్రాహిమాం త్రిపురంతక |
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ ౧౫ 

నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర |
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే ౧౬ 

గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల |
త్వం చిత్వమాదితశ్చైవ త్వం బుద్ధిస్త్వం పరాయణం ౧౭ 

కర్మణామనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయం ఛింది సర్వ శత్రూన్నివక్త్యాయ ౧౮ 

సర్వ వ్యాధినివారణం రుద్రలోకం స గచ్ఛతి
రుద్రలోకం సగచ్ఛత్యోన్నమః ||

*ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తం శ్రీ రుద్రకవచం సంపూర్ణం ||*
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

Friday, 15 December 2023

_*ధనుర్మాసం విశిష్టత*_🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴



ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.

*భోగితో ముగుస్తుంది:*

సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) *మార్గళి వ్రతం* పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు,పూజలు,జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

*ఎంతో పునీత మాసం:* 

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

*బ్రహ్మముహూర్తంలో పారాయణం:*

ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్త్రవచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , పావై అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వా చార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధు సూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

*శ్రీకృష్ణుడికి తులసిమాల:*

ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగు తుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో , నారాయణ సంహితలోకనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులు చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజు అయినా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.

*శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*
*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:* 

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. 

*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?*

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగు తుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. 

*కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:*

వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

*ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:*

రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభ కార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.

*గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?*

ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగు తుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

   *కాత్యాయనీ వ్రతం:* 
   *పూజా విధానం:*

రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం , గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.

*పాశురములు* చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివర పాశురంలో ఒక లైను చదవాలి.
చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.

*నైవేద్యం* సమర్పంచాలి(రోజు పొంగలి , దద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం*

*హరే క్రిష్ణ గోదా క్రిష్ణ*
🌴🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌴

Wednesday, 6 December 2023

నాయనార్లు గొప్ప శివ భక్తులు


*భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి..*.

*తిరు నిన్ద్రసీర్ నెడుమార నాయనార్*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



తిరు అలవై (మధురై) నగరాన్ని కున్ పాండియన్ అనే రాజు పరిపాలించే వాడు. అతడి ధర్మపత్ని మనగాయక్కర సియార్. ఆమెకు శివుడంటే మహా భక్తి. పాండియన్ మాత్రం జైన మత ప్రవచనాలు తత్వాలు విని ఆకర్షితుడై జైన మతాన్ని స్వీకరించాడు.
తాను జైన మతాన్ని అనుసరిస్తున్నందు వల్ల ప్రజలంతా తప్పక అదే అనుసరించాలని శివుడికి ఏ విధమైన పూజలు నిర్వహించ రాదని శాసనం చేసి దానిని గట్టిగా అమలు పరిచాడు.
రాణి తన లాగే శివ భక్తుడైన మంత్రి కులచిరైయార్ సహాయంతో తిరుజ్ఞాన సంబంధార్ అనే శైవ మత ప్రచారకుడిని మధురైకు పిలిపించింది.
        
 ఆయన సందేశాలతో శివ మహిమను వ్యాప్తి చేయించి ప్రజలలో శివుడి పట్ల భక్తిని పెంపొందింప చేయడం ద్వారా తన భర్త చేస్తున్న శివాపరాదాన్ని కొంత మేరకయినా తగ్గించాలను కుంది.

  సంబంధార్ మధురై ఊరి పొలిమేరలో విడిది చేసి, జైనుల నుండి వస్తున్న తీవ్ర ప్రతిఘటనల మధ్య తన శిష్య బృందంతో కలిసి, జనంలో శివుడి పట్ల భక్తి ఏర్పడేలా ప్రచారం నిర్వహించ సాగాడు. 
 ఇంతలో దైవ లీల వలన రాజు గారు కున్ పాండియన్ కి సుస్తీ చేసింది. ఆయనకు రాచపుండు లేచి తీవ్రమైన ఇబ్బంది పెట్టింది. ఆ బాధతో లేచి తిన్నగా నిలబడ లేని పరిస్తితి. రాజ వైద్యులు ఇస్తున్న మందులు గానీ, రాజ పురోహితులు చేస్తున్న పూజలు మంత్రాల వల్ల గానీ ఉపయోగం లేకుండా అయింది. మంచానికే అంకిత మయ్యాడు. రాణి గారు చాలా బాధపడింది. ఇది శివ దోష ఫలితమని గ్రహించి, సంబంధార్ ను తీసుకు రావలసిందిగా చెప్పింది.

సంబంధార్ రాజు పరిస్తితిని చూసి, అతడి రోగం తగ్గి పోవాలని ఆ దేవదేవుడైన పరమ శివుడిని అతి మధుర మైన గానంతో స్తుతించాడు. అందరూ చూస్తుండగానే అద్భుతం జరిగింది. రాజు కున్ పాండియన్ శరీరం మీద వున్న వ్రణములు మాయ మయ్యాయి. అతడు లేచి పూర్వం వలే నిటారుగ నిలబడి హుషారుగా కనిపించాడు. 
మృత్యుకోరల నుండి తాను శివ భగవానుడి అనుగ్రహం వల్లనే రక్షింపబడ్డానని గ్రహించిన పాండియన్ గొప్ప శివ భక్తుడిగా మారిపోయాడు. తన జీవిత కాలం శైవ మత సిద్ధాంత వ్యాప్తికి పాటు పడ్డాడు. ఆయనకు తోడుగా భార్య మనగాయక్కరసియార్ సహకరించారు. చరమార్దంలో శివ సాయుజ్యం పొందారు.

*ఓం నమశ్శివాయ...*
*హర హర మహాదేవ శంభో శంకర*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Tuesday, 5 December 2023

శివ దర్శనం



*జంబుకేశ్వరుడు-తిరువనైకావల్- తమిళనాడు*

శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో తిరువనైకావల్‌లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. 

స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీ మాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రమిది.ఒక వైపు కావేరి నది, మరో వైపు కొలరున్‌ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వరం ఉంది. తొలి చోళ రాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు సంగం గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శివభక్తులు నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుడిని స్తుతించారు.

*స్థలపురాణం:*

మహదేవుని ఆజ్ఞమేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించి కావేరి నదిలోని జలంతో లింగాన్ని తయారుచేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతిచెందింది. అందుకనే అప్పుస్థలగా కూడా పిలుస్తారు.

*దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.*
 
జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారాబయటకురావడంతో ముని శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందు కుంటున్నారు*

సాలెపురుగు, ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. ఈ కథనం శ్రీకాళహస్తి క్షేత్రంతో పోలివుండటం విశేషం. శివకవి తిరునవక్కురసర్‌ తన రచనల్లో స్వామి వారి మహిమలను వర్ణించాడు. 
స్వామిని ప్రార్థిస్తే చింత లేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం.

*అద్భుత శిల్పకళ..*

ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపరులను ముగ్ధులను చేస్తుంది. మొత్తం ఐదు ప్రాకారాలు కలిగిన ఆలయం బాగా విశాలంగా ఉంటుంది. వెయ్యి స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు అలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి.

*ఓం నమః శివాయ*
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

Saturday, 26 August 2023

అష్టాదశ శక్తి పీఠాలు

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలని శక్తి పీఠాలు అని ఎందుకు అంటారు..??

అష్టాదశ శక్తి పీఠాలు 
         హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు. పురాణాలు, శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు.

🌺ఈ శక్తిపీఠాలు మన దేశములోనే కాకుండా, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

🌺శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము. మానవుడు తన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు. ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు. ఆ శక్తినే దేవుడు అని అన్నాడు. ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ, మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు. 

🌺ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు. అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కువ మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు. ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నాడు. వారు క్రమముగా సృష్టి, స్థితి, లయ కర్తలని పేర్కొన్నాడు. వీరి భార్యలను సరస్వతి, లక్ష్మి, పార్వతి అనియూ వీరు విద్య, ధన, మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు. ఈ విధముగా ప్రకృతి శక్తి ఒక్కటే అయినా మానవుడు తనకిష్టమైన రూపములో, తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూ ఉన్నాడు.

అష్టాదశ శక్తి పీఠాలు - పురాణ కధ
🌺ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. 

🌺ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి, సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ 'శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

🌺కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

🌺అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. 

🌺మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ (గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్పూర్-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.

1. శాంకరీదేవి
🌺లంకాయాం శాంకరీదేవి అంటే మునులూ రుషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2. కామాక్షి
🌺సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం. మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. 

🌺అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖల
🌺అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరూ కోల్కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న 'చోటిల్లామాత' ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. 

🌺కానీ పశ్చిమబెంగాల్లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
🌺హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెప్తుంది. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
🌺మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
🌺విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం చెప్తుంది. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7. మహాలక్ష్మి
🌺రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్ను 'అవిముక్త క్షేత్రం' గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి
🌺మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి
🌺సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక
🌺పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో) తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి
🌺గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ
🌺సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామాఖ్య
🌺అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్బేహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి
🌺అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమని అంటారు.

15. సరస్వతి
🌺పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16. వైష్ణవీదేవి
🌺అమ్మవారి నాలుక హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17. మంగళగౌరి
🌺సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18. విశాలాక్షి
🌺సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

🌺ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

Wednesday, 1 March 2023

శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం పునః నిర్మాణం

శ్రీకాళహస్తిలోని అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం పునః నిర్మాణం కు శిథిలాలు మరియు  ధ్వజస్థభం తొలగిస్తున్న దృశ్యము
ఓం గోవిందాయ నమః 🙏🙏🙏

Sunday, 26 February 2023

శాంతి అభిషేకం

 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో స్వామి అమ్మవార్ల గా అలంకరణ చేసిన  సాలిపురుగు పాము ఏనుగు  వినాయక స్వామి మరియు వివిధ పంచలోహ విగ్రహాలకు శాంతి అభిషేకం నిర్వహించారు
 ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Saturday, 25 February 2023

మహాశివరాత్రి

 శ్రీకాళహస్తిలోని మాహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి తిరునాళ్లు మోహరాత్రి 
 స్వామి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు చేసి అమ్మవారి ఆలయంలో ఉన్న ఏకాంత సేవ మండపంలో కి వేద మంత్రోచరణ మంగళ వాయిద్యాల నడుమ పూజలు జరిపి శయన మండపంలో కొలువుతీర్చారు
 ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Friday, 24 February 2023

మహా శివరాత్రి

 శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పల్లకి సేవ వైభవోపేతంగా జరిగింది
శ్రీ  కాళహస్తీశ్వరుడు వివాహ అనంతరం జ్ఞానప్రసూనాంబ దేవిని పక్కనపెట్టి గంగాదేవితో ఉండడం చూసి అలుగుతున్న కార్యక్రమం మనం దర్పణంలో తిలకించవచ్చు స్వామి అమ్మవార్లను అలంకార మండపం నుంచి అలంకరణ చేసి తీసుకువచ్చి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు చేశారు
 ఓం శ్రీ కాళహస్తీశ్వర నమః 🕸️🐍🐘

మహా శివరాత్రి

 శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తీర్థవారి ధోజావరోహణం కార్యక్రమం అనంతరం గంగాదేవి సమేత సోమస్కందమూర్తి సింహాసనం పై జ్ఞానప్రసునంబ దేవి కామదేనువు వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు
 ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Thursday, 23 February 2023

మహా శివరాత్రి

 శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజవరోహణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు పాలు గంధం మరియు సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవం నిర్వహించారు
ఓం 
🕸️🐍🐘 శ్రీకాళహస్తీశ్వరాయ నమః🕸️🐍🐘

మహా శివరాత్రి

 నేడు దేవరాత్రి  ఓం నమః శివాయ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం శ్రీ స్వామి అమ్మవార్ల కేడిగా వాహనంపై నాలుగు మడా వీధుల యందు విహరించారు.
 ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Wednesday, 22 February 2023

మహా శివరాత్రి

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి అమ్మవారు అశ్వ వాహనం అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించారు పట్టనం పుర వీధులలో ఊరేగింపు చేశారు 
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘


మహా శివరాత్రి

శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గిరి ప్రదక్షణ వేలాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది 
మన శ్రీ కాళహస్తి లో గిరిప్రదక్షిణ సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది ఎక్కడ లేనివిధంగా జరుగుతుంది మొదట కనుమ రోజు వెళ్లి స్వామి అమ్మవార్లు కొండల్లో (గిరిల్లో) నివాసం ఉంటున్న దేవతలను సప్తఋషులను వివాహానికి ఆహ్వానించడం కోసం వెళతారు మరలా వివాహ అనంతరం దేవతలను సప్తఋషులు ను వారి వారి స్థావరాలకు వీడ్కోలు పలకను వెళతారు 
ఓం శ్రీకాళహస్తిశ్వరాయ నమః 🕸️🐍🐘

Tuesday, 21 February 2023

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆనంద రాత్రి

శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనంద రాత్రి సందర్భంగా నిన్న రాత్రి సభాపతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది  🙏🙏🙏🙏🙏
దక్షయజ్ఞం సమయంలో సతివియోగంతో పరమేశ్వరుడు యోగ ధ్యానంలో వెళ్లడంతో సర్వలోకాలు తల్లడిల్లి పోతాయి అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని సంతానంతో మాత్రమే మృత్యువు పొందే విధంగా వరాన్ని పొందుతాడు శివునికి సతీదేవి లేదని ఆయనకు వివాహం జరగలేదని తలచి తారకాసురుడు డైన రాక్షసుడు తన వికృత రూపం చూపుతాడు అదే సమయంలో స్కందని ధ్యానం కోసం పార్వతి దేవి హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది ఆ సమయంలో నటరాజ స్వామికి శివకామి సుందరితో వివాహం జరిపిస్తారు
 స్వామివారిని పాలు పెరుగు పంచామృతం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారి కల్యాణం జరిగింది
పరమశివుడు మరో రూపం (నటరాజస్వామి ) జ్ఞాన ప్రసూనంబా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి కళ్యాణం అనంతరం శివకామిదేవి సమేత నటరాజ స్వామికి వివాహం జరగడం అనవాయితీ అనంతరం స్వామి అమ్మవార్లను పట్టణ పురవీధులు ఊరేగింపు చేశారు
ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Monday, 20 February 2023

మహా శివరాత్రి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్కంద రాత్రి పురస్కరించుకొని ఉదయం గంగా భవాని సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి చెప్పరా వాహనంపై జ్ఞాన ప్రసూనామాదేవి కామదేవుని వాహనంపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Sunday, 19 February 2023

మహా శివరాత్రి

శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లో భాగంగా నిన్న బ్రహ్మ రాత్రి ఉదయం స్వామి అమ్మవారు రథోత్సవం అలాగే సాయంత్రం నారద పుష్కరణలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది 
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

మహాశివరాత్రి

శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు రథోత్సవం పూర్వకాలం నందు బ్రహ్మ తానే స్వయంగా నిర్వహించిన కార్యాన్ని మన పూర్వపండితుల కాలం నుంచి ఇప్పటివరకు జరుపుకుంటున్నాం బ్రహ్మ తన స్వయంగా నిర్వహించిన కార్యాన్ని బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కనుక బ్రహ్మోత్సవంగా నానుడి 🕸️🐍🐘
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🙏🏻

Friday, 17 February 2023

శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నాగరాత్రి గంగాదేవి సమేత సోమస్కంద మూర్తి పెద్ద శేష వాహనంపై మరియు జ్ఞాన ప్రసూనాంబాదేవి యాలివాహనంపై ఊరేగుతూ పట్టణ పురవీధుల్లో కనువిందు చేశారు 
శ్రీకాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

Thursday, 16 February 2023

శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గంధర్వ రాత్రి గంగా దేవి సమేత సోమస్కంద మూర్తి రావణాసుర వాహనం మరియు అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు కనువిందు చేశారు 
గంధర్వ రాత్రి అనగా రావణుడు ప్రధాన భూమి పోషించగా నారద తుంబురులతో పాటు గంధర్వులు సమావేశమై సకల దేవ భూత గణాలు సమక్షంలో పరమేశ్వరుని కీర్తిన్చేస్తారు ఈ నేపథ్యంలో స్వామివారు రావణాసురుపై అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శనం కల్పించారు 
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘

శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో వ రోజు స్వామి హంస వాహనంపై అమ్మవారు యలి వాహనంపై ఊరేగి పట్టణ పుర వీధిలో ఊరేగింపు నిర్వహించరు  
ఓం శ్రీ కాళహస్తీశ్వరయ నమః 🕸️🐍🐘