Friday, 6 December 2024

సుబ్రహ్మణ్య షష్ఠి

సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు....

స్కందోత్పత్తి – కుమారసంభవం

మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా ! నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.

ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగానరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ ముక్కలుగా నరికేశాడు. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది.

ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ ‘నాయనా! నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి, వరాంగికి పెళ్ళిచేశారు.
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగితే వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ! వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.

తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా! ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.

తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారీ ! శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.

ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివతేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరు కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వరా! మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా! దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను? అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు,దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.

ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేసారు. ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనకే ‘గుహా’ అనే పేరు ఉంది. పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు.

Tuesday, 5 November 2024

కార్తీక పురాణం - 6 వ అధ్యాయము

కార్తీక పురాణం - 6 వ అధ్యాయము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 *దీపదానవిధి - మహాత్మ్యం*
*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*

☘☘☘☘☘☘☘☘☘

ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.

*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*
*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*

అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు . దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

పూర్వ కాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*

Monday, 4 November 2024

నాగుల చవితి

నాగుల చవితి🚩

🕉️🐍🕉️🐍🕉️🐍🕉️🐍🕉️🐍🕉️

ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది.  నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. 

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితినాడు  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 

నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 

దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.
కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని  పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆధ్యాత్మిక యోగా పరంగా :- ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగుల చవితి మంత్రం
పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.

పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .

నడుము తొక్కితే నావాడు అనుకో 
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో 
తోక తొక్కితే తోటి వాడు అనుకో 
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. 

ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Sunday, 3 November 2024

కార్తీకపురాణం - 3 వ అధ్యాయము

కార్తీకపురాణం - 3 వ అధ్యాయము


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*కార్తీక మాస స్నాన మహిమ*
*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*


☘☘☘☘☘☘☘☘


జనక మహరాజా ! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక , కార్తీక స్నానములు చేయక , అవినీతి పరులై , భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క , పిల్లిగా జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు అయిననూ స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.

*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు , తపశాలి , జ్ఞానశాలి , సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్షంబు పై భయంకర ముఖములతోను , దీర్ఘ కేశములతోను , బలిష్టంబులైన కోరలతోను , నల్లని బాన పొట్టలతోను , చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ , ఆ దారిన పోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపితము చెయుచుండిరి. తీర్ధ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు 
సమయమున , బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ ! అనాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని , నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని , బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - ఈ పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ ! అని వేడుకొనగా , ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి *'మహానుభావా ! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు'* యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని *' ఓయీ ! మీరెవరు ? ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను ? మీ వృత్తాంతము తెలుపుడు'* అని పలుకగా వారు *'విప్ర పుంగవా ! మీరు పూజ్యులు , ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు , మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు'* అని అభయమిచ్చి , అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం బ్రహ్మనుడను నేను మహా పండితుడనని గర్వము గలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని పసువునై ప్రవర్తించితిని , బాటసారుల వద్ద , అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు , దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక , పండితులను అవమానపరచుచు , లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని.
ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చేను. వచ్చిన పండితుని నేను దూషించి , కొట్టి అతని వద్ద ఉన్న ధనము , వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వేచితిని. అందులకు విప్రునకు కోపము వచ్చి *'ఓరి నీచుడా ! అన్యక్రాంతముగ డబ్బు కూడా బెట్టినది చాలక , మంచి చెడ్డలు తెలియక , తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి , నివు రాక్షసుడవై , నరభక్షకుడవై నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు' గాక !* అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా ! కాన నా అపరాదము క్షమింపుమని వారిని ప్రార్దించితిని. అందులకతడు దయతలచి' ఓయీ ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు. నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువు గాక' అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేని రాక్షస స్వరుపమున నరభక్షణము చేయుచుంటిని. కాన , ఓ విప్రోతమ ! నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు - ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి , వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచుండేడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి ఎరుగను , నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కావున , నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్దరింపుము' అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా ! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక , కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పించక , భక్తులు గొనితేచ్చిన సంభావమును నా వుంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణనంతరము ఈ రూపము ధరించితిని , కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు' మని ప్రార్ధించెను. ఓ జనక మహారాజ ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి *'ఓ బ్రహ్మ రాక్షసులరా ! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును'* అని , వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది , వారికీ సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన , ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*
*మూడవ అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*

Saturday, 2 November 2024

కార్తీక పురాణగాధ 🙏


కార్తీకపురాణం - 2 వ అధ్యాయం*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సోమవార వ్రత మహిమ*
*కుక్క కైలాసానికి వెళ్లుట*

☘☘☘☘☘☘☘️☘☘

వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు *”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.

*”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత , తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి , సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.

*🌹కుక్క కైలాసానికి వెళ్లుట🌹*

*”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు , శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’* అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో , కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను , భర్తను తిట్టడం , కొట్టడం , రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు , బట్టలు , పువ్వులు , ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని , అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి , నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు , పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి , పాడుచేసి , విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.
ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము , రక్తం కారుతూ , క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి , పురుగులు పడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని , విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు , అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో , చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా , ఇటు ఏడు తరాలు , అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ , క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి , ఉపవాసము ఉండి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి , ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి , కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.
వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము , శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క *‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’* అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. *‘రక్షించు… రక్షించు…’* అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు *‘ఎవరు నీవు ? నీ వృత్తాతమేమిటి ?’* అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు , భర్తను చంపడం , వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి , చనిపోయిన తీరును , నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. *‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి , ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి , నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి , సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”*


_*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*కార్తీక మాసం మహత్యం*
*కార్తీక మాస వ్రతవిధానం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఒక రోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.

*కార్తీక వ్రతవిధానం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*

Thursday, 31 October 2024

_*నరక చతుర్దశి..*_

_*నరక చతుర్దశి..*_
🪔🕯️🪔🕯️🪔🪔🕯️🪔🕯️🪔🕯️

 *అభ్యంగన స్నానంతోపాటు ఇవన్నీ చేయాలి...* 

💫 శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి *'నరకచతుర్దశి'* అనే పేరు వచ్చింది. ఆశ్వియుజ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చెయ్యాలి. స్నానాంతరం తప్పనిసరిగా యమతర్పణం విడవాలి. 

💫 ఇక్కడ సూర్యోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట లోపు మాత్రమే, రాత్రి సమయం ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని "గౌణం" అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం).
 
💫 దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మిదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. 

💫తలంటుకి ఉపయోగించే నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందువల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. 

*“సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః”* 

ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగనాన్ని చెయ్యాలి.
 
💫 ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగనస్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. 

💫 అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా *‘యమాయయః తర్పయామి’* అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. 
 
💫 నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికి (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి. 

1. యమం తర్పయామి 
2. ధర్మరాజానం తర్పయామి 
3. మృత్యుం తర్పయామి 
4. అంతకం తర్పయామి 
5. వైవస్వతం తర్పయామి 
6. కాలం తర్పయామి
7. సర్వభూతక్షయం తర్పయామి 
8. ఔదుంబరం తర్పయామి 
9. దధ్నం తర్పయామి
10. నీలం తర్పయామి
11. పరమేష్ఠినం తర్పయామి
12. వృకోదరం తర్పయామి
13. చిత్రం తర్పయామి
14. చిత్రగుప్తం తర్పయామి

అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలాంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలెను.

💫 యముణ్షి పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. 

💫 ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. 

💫 ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.
 
*“చతుర్దశ్యాం తు యే దీపాన్‌, నరకాయ దదాతి చ|*
*తేషాం పితృగణా స్సర్వేనరకాత్‌ స్వర్గ మాప్నుయుః||* 

💫 అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

*సేకరణ:* 
🪔🕯️🪔🕯️🪔🪔🕯️🪔🕯️🪔🕯️

Sunday, 27 October 2024

🌼 *కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు, పటించవలసిన స్త్రోత్రాలు..*🌼

🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

🌼 *కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు, పటించవలసిన స్త్రోత్రాలు..*🌼

 *కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్యా దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది*.


🌼 *కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురి కి విశేషం* *కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం.. చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది*..*ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.*

*జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది.*
 
🌼కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి,
 
🌼ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి, 

🌼వ్యాపారం లో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి, 

🌼మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మనసా దేవీ స్త్రోత్రం చదవాలి,

🌼 నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి..

🌼శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం , 

🌼శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం, 

🌼కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన, 

🌼భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, 

🌼భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం,

🌼 ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం,

🌼 రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం, 

🌼నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియంగా నెల మొత్తం పారాయనఁ చేస్తుండాలి..

🌼విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి

🌼అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలిగించే హనుమంతుడి స్త్రోత్రం ఇక్కడ ఇస్తాను గమనించండి అది వద్దు అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోండి.

🌼 *ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవాలి* .

🌼 *ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలి తులసి కోటలో దీపం పెట్టాలి*, *ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చేoదుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు చేoదుతుంది.. అకండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం*   

🌼 *కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తాను గమనించండి.*🌼

🌼 *శ్రీ దామోదరాష్టాకం*🌼

నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం | 
యశోదాభియోలూఖలాద్దావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం | 
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ-దామోదరం భక్తి బద్ధమ్ || 

ఇతిదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ | 
తదీయేషితాశ్లేషు భకెర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||

వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణ్నేహం వరేషాదపీహ | 
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యెః ||

ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్వృతం కుంతలైః స్నిగ్ద -రకైశ్చ గోప్యా | 
ముహుశ్చుంబితం బింబరక్త ధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 

నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్దిమగ్నం | 
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను - గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||

కువేరాత్మజౌ బద్దమూర్వైవ యద్వత్ త్వయా మోచితా భక్తిభాజౌ కృతా చ | 
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేపి దా మోదరేహ ||  

నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే | 
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం ||

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సాంపూర్ణం ||

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *లక్ష్మీ కటాక్షం*🌼

"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
  భగవతి మమ సంరుద్ధౌ జ్వల
  జ్వల మా సర్వ సంపదం దేహిదేహి
  మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''

ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. రోజూ 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం*🌼

దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ |
పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా ||

స్తోత్రానామ్ లక్షణం వేదే స్వభావాఖ్యాన తత్ప రమ్ |
న క్షమః ప్రకృతేవక్తూమ్ గుణానామ్ గణనం తవ ||

సుద్దసత్వ స్వరూపా త్వమ్ కోపహింసా వివర్జితా |
న చ శక్తో మునిస్తేన త్యక్తుo యాం చ కృతా యతః ||

త్వం మయా పూజితా సాద్వి జననీ మేయథో ధీతహ |
దయారూపా చ భగినీ క్షమా రూపా యథా ప్రసూమ్ ||

త్వయా మే రక్షితా ప్రాణాః పుత్ర దారాః సురేశ్వరీ |
అహం కరోమి త్వత్పూజామ్ ప్రీతిశ్చ వర్ధతాం సదా ||

నిత్యా యధ్యపి పూజ్యా త్వం సర్వత్ర జగదంబికే |
తథాపి తవ పూజాం చ వర్ధయా మి సురేశ్వరీ ||

యే త్వా మాషాడ సంక్రాంత్యామ్ పూజ యిష్యంతి భక్తితహ |
పంచమ్యాం మానసాఖ్యాయ మాసాంతే వా దినే దినే ||

పుత్రపౌత్రాదయః తేషామ్ వర్దితే చ ధనాని వై |
యశస్వినః కీర్తి మంతో విధ్యావంతో గుణాన్వితాః ||

యే త్వామ్ న పూజాశ్యంతి నిందం త్యజ్ఞాన తో జనాః |
లక్ష్మి హీనా భవిష్యన్తీ తేషామ్ నాగభయం సదా ||

త్వమ్ స్వయం సర్వలక్ష్మీశ్చ వైకుంటే కమలాలయా |
నారాయణాంశో భగవాన్ జరత్కారు మునీశ్వరః ||

తపసా తేజసా వా పిచ మానసా సన్నుతే పివా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వమ్ మనసాబిదా ||

మానసాదేవి శక్త్యాత్వమ్ స్వాత్మనా సిద్ధ యోగినీ |
తేన త్వమ్ మానసా దేవీ పూజితా వందితా భవ ||

యే భక్త్యా మానసా దేవ్యాహ్ పూజయం త్య నిశం భృశం |
తేన త్వామ్ మానసా దేవీం ప్రవదంతి మనీషిణః ||

సత్య స్వరూప దేవీ త్వామ్ శశ్వత్ సత్య నిషేవణాత్ |
యో హి త్వామ్ భావయే నిత్యం సత్వామ్ ప్రాప్నోతి తత్పరః ||

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *శ్రీ మారుతీ బీజమంత్ర స్తోత్రమ్*🌼

ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రలయం కాలానల ప్రభాప్రజ్వలనాయ | ప్రతాప వజ్రదేహాయ | అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ నీరదైత్యదానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ | భూతగ్రహబంధనాయ | ప్రేతగ్రహబంధనాయ | పిశాచ గ్రహబంధనాయ | శాకినీ డాకినీ గ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | కాకినీ కామినీ గ్రహబంధనాయ | బ్రహ్మగ్రహబంధనాయ | బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | మారీగ్రహబంధనాయ | ఏహి ఏహి | ఆగచ్ఛ అగచ్ఛ | ఆవేశయ ఆవేశయ | మమహృదయే ప్రవేశయ స్ఫుర స్ఫుత | ప్రస్ఫుర ప్రస్ఫుర | సత్యంకథయ వ్యాఘ్రముఖబంధన సర్పముఖంబరాజముఖంబ నారీముఖబంధన సభాముఖంబ శత్రుముఖం బసర్వముఖంబ లంకాప్రాసాద భంజనం | అముకం మే వశమానయ | క్లీం క్లీం క్లీం హ్రీం సశ్రీం శ్రీం రాజానం వశమానయ | శ్రీం క్లీం క్లీం స్తీ ఆకర్షయ శత్రూన్ మర్దయ మార్దయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీ రామచంద్రాజ్ఞయా మమ మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర: ఫట్ స్వాహా || విచిత్రవీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మకురు కురు | హన హన హుం ఫట్ స్వాహా || ఏకాదశశతవారం జపిత్వా సర్వశత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ||

||ఇతి మారుతీస్తోత్రమ్ సంపూర్ణం ||

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *నవగ్రహ పీడాపరిహార స్తోత్ర*🌼

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి: ||
రోహిణీశ: సుధామూర్తి: సుధాగాత్ర: సుధాశన: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు: ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా |
వృష్టికృద్వృష్టిహర్తాచ పీడాం హరతు మే కుజ: ||
ఉత్పాతరూపీ జగతాం చంద్రపుత్రో మహాద్యుతి: |
సూర్యప్రియకరో విద్వాన్పీడాం హరతు మే బుధ: ||
దేవమంత్రీ విశాలాక్ష: సదా లోకహితే రత: |
అనేక శిష్య సంపూర్ణ: పీడాం హరతు మే గురు: ||
దైత్య మంత్రీ గురుస్తేషాం ప్రణవశ్చ మహామతి: |
ప్రభుస్తారాగ్రహణాం చ పీడాం హరతు మే భృగు: ||
సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: |
మందచార: ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని: ||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల: |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ||
అనేకరూప వర్ణైశ్చ శతశోఽథ సహస్రశ: |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమ: ||
|| ఇతి నవగ్రహ పీడాపరిహార స్తొత్రం సంపూర్ణం

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *హయగ్రీవస్తోత్రం*🌼

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||


ఫలశ్రుతి :

శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా                
  ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః

    ధ్యానమ్

ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ 1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ 3

పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ 4

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ 5

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా 6

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి 7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో 9

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. 11

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. 12

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 13

తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. 14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. 15

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *కుజదోష నివారణ శ్రీ షణ్ముఖదండకం*🌼

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమ:

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

🌼 *మంగళచండికా స్త్రోత్రం* 🌼

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే

🌼ఈ మంగళ చండికా స్త్రోత్రం ప్రతి రోజూ రాహుకాలంలో చదవటం వల్ల రాహు గ్రహ దోషాలు, ఎన్నో ఆటంకాలు సమస్యలు తీరుతుంది.

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

*ఈ స్త్రోత్రలు తో పాటు శివ స్ట్రోత్రాలు కూడా పారాయనఁ చేయాలి ఎవరికి ఏది అవసరమో అది నిత్యా పారాయనఁ చేయాలి...అన్ని కూడా పూజ సమయంలో గృహంలో పటించడం మంచిది* 
 
🙏 *శ్రీ మాత్రే నమః🙏

Saturday, 26 October 2024

♦️🔱కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు, పటించవలసిన స్త్రోత్రాలు..🔱♦️

♦️🔱కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు, పటించవలసిన స్త్రోత్రాలు..🔱♦️

♦️కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్యా దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది.♦️

🕉️కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురి కి విశేషం .కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం.. చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది..ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.

🌞జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది. 
🌷కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి, 
🌷ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి, 
🌷వ్యాపారం లో నష్టాలు,  కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి, 
🌷మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మనసా దేవీ స్త్రోత్రం చదవాలి,
🌷 నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి..
🌷శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం , 
🌷శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం, 
🌷కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన, 
🌷భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, 🌷భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం,
🌷 ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం,
🌷 రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం, 
🌷నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియంగా నెల మొత్తం పారాయనఁ చేస్తుండాలి..
🌷విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి
🌷అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలిగించే హనుమంతుడి స్త్రోత్రం ఇక్కడ ఇస్తాను గమనించండి అది వద్దు అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోండి.

🌷🔱🌷ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవాలి .

🌷ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలి తులసి కోటలో దీపం పెట్టాలి, ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చేoదుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు  చేoదుతుంది.. అకండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం   

🔱కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తాను గమనించండి.

🕉️శ్రీ దామోదరాష్టాకం🕉️

నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం | 
యశోదాభియోలూఖలాద్దావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం | 
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ-దామోదరం భక్తి బద్ధమ్ || 

ఇతిదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ | 
తదీయేషితాశ్లేషు భకెర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||

వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణ్నేహం వరేషాదపీహ | 
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యెః ||

ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్వృతం కుంతలైః స్నిగ్ద -రకైశ్చ గోప్యా | 
ముహుశ్చుంబితం బింబరక్త ధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 

నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్దిమగ్నం | 
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను - గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||

కువేరాత్మజౌ బద్దమూర్వైవ యద్వత్ త్వయా మోచితా భక్తిభాజౌ కృతా చ | 
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేపి దా మోదరేహ ||  

నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే | 
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం ||

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సాంపూర్ణం ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️లక్ష్మీ కటాక్షం🕉️

"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
  భగవతి మమ సంరుద్ధౌ జ్వల
  జ్వల మా సర్వ సంపదం దేహిదేహి
  మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''

ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. రోజూ 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🌺🌺🌺🌺

🕉️ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం🕉️

దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ |
పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా ||

స్తోత్రానామ్ లక్షణం  వేదే స్వభావాఖ్యాన తత్ప రమ్ |
న క్షమః ప్రకృతేవక్తూమ్ గుణానామ్ గణనం తవ ||

సుద్దసత్వ స్వరూపా త్వమ్ కోపహింసా వివర్జితా |
న చ  శక్తో  మునిస్తేన త్యక్తుo యాం చ కృతా యతః ||

త్వం మయా పూజితా సాద్వి జననీ మేయథో ధీతహ |
దయారూపా  చ భగినీ క్షమా రూపా యథా ప్రసూమ్ ||

త్వయా మే రక్షితా ప్రాణాః పుత్ర దారాః సురేశ్వరీ |
అహం కరోమి త్వత్పూజామ్ ప్రీతిశ్చ వర్ధతాం సదా  ||

నిత్యా యధ్యపి పూజ్యా త్వం సర్వత్ర జగదంబికే  |
తథాపి తవ పూజాం చ వర్ధయా మి సురేశ్వరీ ||

యే త్వా మాషాడ సంక్రాంత్యామ్ పూజ యిష్యంతి భక్తితహ |
పంచమ్యాం మానసాఖ్యాయ మాసాంతే వా దినే దినే ||

పుత్రపౌత్రాదయః తేషామ్ వర్దితే చ ధనాని వై |
యశస్వినః కీర్తి మంతో విధ్యావంతో  గుణాన్వితాః ||

యే త్వామ్ న పూజాశ్యంతి నిందం త్యజ్ఞాన తో జనాః  |
లక్ష్మి హీనా భవిష్యన్తీ తేషామ్ నాగభయం సదా  ||

త్వమ్ స్వయం  సర్వలక్ష్మీశ్చ  వైకుంటే  కమలాలయా |
నారాయణాంశో భగవాన్ జరత్కారు మునీశ్వరః  ||

తపసా తేజసా వా పిచ మానసా  సన్నుతే  పివా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వమ్  మనసాబిదా ||

మానసాదేవి  శక్త్యాత్వమ్  స్వాత్మనా సిద్ధ యోగినీ |
తేన త్వమ్ మానసా దేవీ పూజితా వందితా భవ ||

యే భక్త్యా మానసా దేవ్యాహ్ పూజయం త్య నిశం భృశం |
తేన త్వామ్ మానసా దేవీం ప్రవదంతి మనీషిణః  ||

సత్య స్వరూప దేవీ  త్వామ్ శశ్వత్  సత్య నిషేవణాత్ |
యో హి త్వామ్ భావయే  నిత్యం  సత్వామ్ ప్రాప్నోతి తత్పరః  ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️శ్రీ మారుతీ  బీజమంత్ర స్తోత్రమ్🕉️

ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రలయం కాలానల ప్రభాప్రజ్వలనాయ | ప్రతాప వజ్రదేహాయ | అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ నీరదైత్యదానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ | భూతగ్రహబంధనాయ | ప్రేతగ్రహబంధనాయ | పిశాచ గ్రహబంధనాయ | శాకినీ డాకినీ గ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | కాకినీ కామినీ గ్రహబంధనాయ | బ్రహ్మగ్రహబంధనాయ | బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | మారీగ్రహబంధనాయ | ఏహి ఏహి | ఆగచ్ఛ అగచ్ఛ | ఆవేశయ ఆవేశయ | మమహృదయే ప్రవేశయ స్ఫుర స్ఫుత | ప్రస్ఫుర ప్రస్ఫుర | సత్యంకథయ వ్యాఘ్రముఖబంధన సర్పముఖంబరాజముఖంబ నారీముఖబంధన సభాముఖంబ శత్రుముఖం బసర్వముఖంబ లంకాప్రాసాద భంజనం | అముకం మే వశమానయ | క్లీం క్లీం క్లీం హ్రీం సశ్రీం శ్రీం రాజానం వశమానయ | శ్రీం క్లీం క్లీం స్తీ ఆకర్షయ శత్రూన్ మర్దయ మార్దయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీ రామచంద్రాజ్ఞయా మమ మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర: ఫట్ స్వాహా || విచిత్రవీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మకురు కురు | హన హన హుం ఫట్ స్వాహా || ఏకాదశశతవారం జపిత్వా సర్వశత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ||

||ఇతి మారుతీస్తోత్రమ్ సంపూర్ణం ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️నవగ్రహ పీడాపరిహార స్తోత్ర🕉️

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి: ||
రోహిణీశ: సుధామూర్తి: సుధాగాత్ర: సుధాశన: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు: ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా |
వృష్టికృద్వృష్టిహర్తాచ పీడాం హరతు మే కుజ: ||
ఉత్పాతరూపీ జగతాం చంద్రపుత్రో మహాద్యుతి: |
సూర్యప్రియకరో విద్వాన్పీడాం హరతు మే బుధ: ||
దేవమంత్రీ విశాలాక్ష: సదా లోకహితే రత: |
అనేక శిష్య సంపూర్ణ: పీడాం హరతు మే గురు: ||
దైత్య మంత్రీ గురుస్తేషాం ప్రణవశ్చ మహామతి: |
ప్రభుస్తారాగ్రహణాం చ పీడాం హరతు మే భృగు: ||
సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: |
మందచార: ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని: ||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల: |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ||
అనేకరూప వర్ణైశ్చ శతశోఽథ సహస్రశ: |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమ: ||
|| ఇతి నవగ్రహ పీడాపరిహార స్తొత్రం సంపూర్ణం

🔺🔺🔺🌹🌹🔺🔺🔺🌹🌹🔺🔺🔺

🕉️హయగ్రీవస్తోత్రం🕉️

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి :💐
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా                
  ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
                            ధ్యానమ్

ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ 1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్   3

పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్    4

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ  5

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా    6

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి 7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ        గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా  8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో   9

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్.   11

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా.   12

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 13

తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః.   14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా.   15

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️ కుజదోష నివారణ శ్రీ షణ్ముఖదండకం🕉️

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమ:
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉️ మంగళచండికా స్త్రోత్రం 🕉️

​రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే​
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే

సేకరణ.
 
🔱శ్రీ మాత్రే నమః🔱

Thursday, 3 October 2024

లగడపాటి భాస్కర్

లగడపాటి భాస్కరుడా... నీకు వందనాలు...  తెల్లటి మేని చాయ మెలి తిరగని పొట్టి మీసం... తెల్ల దుస్తులు చిరు మందహాసం.. మిత భాష్యం అమిత పాండిత్యం...  నామధేయాన్ని సార్ధకం చేశావు కావ్య భాస్కరుడైనావు... ఇంటి పేరు లగడపాటి కాదెప్పుడూ "జగడ"పాటి... తెలుగు పండితుడైనా అమిత భాషి కాదు చిరు మందహాసం మీకు దివ్యాభరణం... ఆకారం చూస్తే పొట్టి మనసు చూస్తే గట్టి...  తెల్లటి దుస్తులతో స్వచ్ఛత మనసు చూస్తే మెతక.... అధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ రచనా వ్యాసంగానికి శ్రీకారం... కవులను కళాకారులను ఏకం చేశావు ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించావు... కవులకు సన్మానాలు సత్కారాలు కవిత్వానికి ఆదరణ అమర్చావు... ధూర్జటి రసజ్ఞ సమాఖ్య ఏర్పరిచావు ధూర్జటి గ్రంథాలయం కోసం ఉద్యమించావు .... ధూర్జటి విగ్రహం కోసం పట్టుబట్టావు కోరిక నెరవేరకనే పయనమయ్యావు... సహస్రావధాని మేడసాని మన్నన పొందావు సహస్ర రచనలకు జీవం పోశావు... మనిషి పొట్టి అయినా సంకల్పం మాత్రం బహు గట్టి... మీరు నాటిన కవిత్వాలు వికసిస్తున్నాయి భాస్కరుడిగా చూసి ఆనందించు...  తొందరపడి వెళ్ళిపోయావు మరో లగడపాటిని పంపడం మరిచావు... అమర లోకంలోని లగడపాటి భాస్కరుడా అందుకో వందనాలు... అభివందనాలు... నీరాజనాలు... ఇట్లు  మీ పూర్వ విద్యార్థి ... ముత్యాల వెంకటరమణ (ఎం.వి.రమణ) సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి...8341378799, 7013518299...