Friday, 24 October 2025

నాగుల చవితి విశిష్టత

--------------------------------------
*నాగుల చవితి* 
--------------------------------------
 *అక్టోబర్ 25 శనివారం నాగులచవితి సందర్భంగా...* 
---------------------------------------
*కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ!_*
*_ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనమ్!!*
--------------------------------------
*ఈ శ్లోకాన్ని నాగులచవితినాడు పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది.*
---------------------------------------
*నాగులచవితికి నాగన్న.. స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న..' అంటూ తెలుగువారు నాగులచవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు. నాగులచవితి పర్వం వెనుక అంతరార్థం, సంప్రదాయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.*
----------------------------------------
*నాగారాధన అనాది యుగాలనుంచి కొన్ని ప్రాంతాంలో కొనసాగుతోంది. కార్తికశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం. మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులో పామురూపంలో ఉండే కుండలినీశక్తిని ఆరాధించడమే నాగులచవితి. శరీరమనే పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము ఉద్రేకముతో విషం కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అని లౌకిక అర్ధంలో చెప్పడమే. నాగులచవితి ప్రయోజనం. నాగుల చవితినాటి రాత్రినుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కానవస్తుంది. ఇది ఉత్థానఏకాదశి వరకూ ఎనిమిదిరోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం. అలాగే కార్తికమాసంలో సూర్యుడు మృత్యువుకు స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు.*
----------------------------------------
*నాగులచవితికి పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలుదారాలతో పుట్టలను అలంకరిస్తారు. చిన్నచిన్న వెండిరేకుల్ని పుట్టకి పెట్టి 'పుట్టాకళ్ళు' అలంకరిస్తారు. “నాగులచవితికి నాగన్నా నీ పుట్టనిండా పాలుపోసేము తండ్రీ! నీ పుట్టదరికి మా పాపలొచ్చేరు. పొరపాటున 'తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నడిచిపో! పడగ తొక్కితే పారిపో! మమ్మల్ని, మా సంతానాన్ని కాపాడు" అంటూ పుట్టలో పాలుపోస్తారు. ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు, తాటి బుర్రగుజ్జు, తేగలు వంటివి నివేదన చేస్తారు". సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు శ్రేష్ఠం. సర్పారాధన చేసే వారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెప్తోంది. నాగేంద్రుడిని స్త్రీలు ఆరాధిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది. వివాహం కానివారు ఆరాధిస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడని విశ్వాసం: సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ.*
---------------------------------------
*పుట్ట మట్టిని 'పుట్టబంగారం' అంటారు. కొద్దిగా పుట్టమట్టి చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి. నాగులచవితికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలి, చలిమిడినే అల్పాహారంగా తింటారు. నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, చలిమిడి చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. "నూకలిస్తా మూకనియ్యి... పిల్లలమూక నాకియ్యి" అంటూ సంతానం కోరే వారు పుట్టలో పాలతో పాటు నూకవేసి వేదుకుంటారు. అన్ని ఆలయాల్లో నాగారాధన విశేషంగా జరుగుతుంది. పామును చంపిన పాపం తొలగిపోవడానికి తైత్తిరీయసంహిత నాగపూజావిధానం వివరించింది.*
--------------------------------------
*పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి. సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం. పుట్టలో సోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసిన సత్యం. అయితే నాగులచవితినాడు మనం పుట్టలో వేసే పిండిపదార్ధాలు, నువ్వులు, బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి. వాటిని తినడానికి కప్పలు, ఎలుకలు ఆ పుట్టల్లోకి చేరతాయి. అవి పాములకు ఆహారంగా మారతాయి. అలా కొద్దిగా పుట్టమట్టి చెవి పాములు తమ నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటిస్థానాల్లోనే ఆహారం లభిస్తుంది. ఫలితంగా పాములకు ప్రాణహాని వాటివలన మనకు హాని రాకుండా నివారించగలుగుతున్నాం. ఇలా ఎలుకలను ఎరవేసి పట్టించడం వల్ల రైతులకు పంటనష్టం కూడా తగ్గుతుంది. పాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకునే విశిష్ట పర్వం నాగులచవితి.*
----------------------------------------     *నాగులచవితి విశిష్టత*
----------------------------------------
*దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని, నాగులచవితి పండుగ అంటారు.* 
*కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*
*మన పురాణాలలో నాగులచవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కదా!. ఈ నాగులచవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవశరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని; అందుకు ' నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే... ఈ నాగుపాముపుట్టలో పాలు పోయడంలో గల అంతర్యము.*
---------------------------------------- 
*దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే చతుర్దశి, షష్టీలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!*
----------------------------------------
*పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ౹* *సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ౹*
*అనంతాది మహానాగ రూపాయ వరదాయచ౹ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా౹౹*
---------------------------------------
*అలా! ఆవుపాలు పుట్టలో పోసి, నాగపూజచేసి,* *చలిమిడి,చిమ్మిలి,అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కాలుస్తారు.*
*ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే! మంచిభర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు,* *యుగాలనాటిది!*
*సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుటనేది, లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.*
-------------------------------------- 
*దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలను ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలూ పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.*
---------------------------------------   *నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము.*
*పొరపాటున "తోకతొక్కితే తొలగిపో! నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ!  అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.*
----------------------------------------  *నూకని పుట్టచుట్టూ... నూకలు నువ్వు తీసుకుని, మూకలు మాకివ్వు తండ్రీ! అని చల్లి, పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మనపొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని, వాటి ఆకలి,దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.*
----------------------------------------
*నాగులచవితిరోజున            ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోషనివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.*
*శ్లో॥ "కర్కోటకస్య నాగస్య*             *దయయంత్యా నలస్యచ।*
 *ఋతుపర్ణస్య రాజర్షే*
 *కీర్తనం కలినాశనమ్‌" ||*
---------------------------------------
*ఈ సర్పారాధనకు తామరపూలు,* *కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు.*
*సర్పారాధన చేసేవారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్యపురాణం చెప్తోంది.*
 ---------------------------------------
*తలనుండు విషము ఫణికిని,* 
*వెలయంగా తోకనుండు* *వృశ్చికమునకున్‌,*
*తలతోకయనక యుండు ఖలునకు,*
*నిలువెల్ల విషము గదరా సుమతీ!*
*అని చెప్పినట్లు... అలా మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి), వాటికంటే భయంకరమైన మానవసర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.*
----------------------------------------
*నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి, ప్తెకివస్తోందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేదమందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది.*
---------------------------------------
*వృశ్చికరాశిలో వచ్చే, జ్యేష్ఠనక్షత్రాన్ని*
*సర్పనక్షత్రం అంటారు.* 
*ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా.... కార్తీక శుద్ధచవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా, ప్రవేశించిన రోజుని* *నాగులచవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ, భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి, మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి, మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులూ కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయులు చాలా ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆరాధ్యదైవంగా పూజిస్తారు కాబట్టి, వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు అంటూ పేర్లు పెట్టుకుంటూనే ఉంటారు.*
---------------------------------------- 
*వ్రతం ఆచరించేపద్ధతి / పూజ చేయువిధానము:*
*దైవారాధన ఒక నమ్మకము. ఏనాడూ నమ్మకమనేది మూఢనమ్మకాలు కాకూడదు.* 
*మూఢనమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీయును.* 
*నమ్మకము - మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది.*
----------------------------------------
*నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి, తలంటుపోసుకొని ఇంట్లో దేవునివద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగుదుస్తులు ధరించాలి.* *తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.* *పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి, దానిపై ఎరుపువస్త్రాన్ని పరుచుకోవాలి.* *నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ ఉంచి, పూజించాలి. పూజకు మందారపూలు,* *కనకాంబరములు, వంటి ఎర్రటి పువ్వులు,*
*నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడి, చిమ్మిలి లను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తిచేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము,నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా* *సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.* *స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో* 
*"ఓం నాగేంద్రస్వామినే నమః"*
 *అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.*
--------------------------------------- 
*దీపారాధనకు* *నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి, నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్రస్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు* *అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి, దీపం వెలిగించి, పుట్టలో పాలుపోసి, పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి, ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయాలి. ఇదీ వ్రతం ఆచరించే పద్ధతి. నాగులచవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే, సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే... దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను, నాగులచవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు వచన.*
--------------------------------------
*చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి, తీసి ధరిస్తే, మనోరథాలు తీరుతాయి.*
*బాలబాలికలు, దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించి, చవితిని స్మరించి, ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి వస్తుంది.*
----------------------------------------
*సంతానానికి, సర్పపూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది.శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య, సంతానంకోసం చాలారోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి, తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు? అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి? అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపంవల్ల ఇలా అయ్యానని చెప్పి, ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి, శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.*
----------------------------------------
*"చలి ప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం, ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.*
---------------------------------------
*భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.*
*''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-*
*''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి, విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని? ప్రశ్నిస్తే – నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.*
 ---------------------------------------
*హైందవ సంప్రదాయంలోనే గాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది.అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి.దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడునాగభూషణుడు, అతని వింటినారి వాసుకి.*
*శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం ఆదిశేషుడు పైనే.*
*వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీనతెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.* ఆంధ్రదేశంలో *నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం.* 
*అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు.* 
*మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు* *జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.*
----------------------------------------
*నాగులచవితికి మిగతా పండుగాల్లాగా ఇళ్ళకు సున్నాలు అవీ పూయకూడదు. ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ, కన్నాలుంటే పూడ్చాకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు లేకపోతే చాక్ పీస్ లతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకీ, తలుపులకీ ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే .... అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించటానికి ఆస్తికుడు వచ్చి, తన మాటల చాతుర్యంతో జనమేజయున్ని మెప్పించి, సర్పయాగాన్ని ఆపి, జగత్కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగులచవితి రోజు ప్రతీ వాకిలి దగ్గరా ఆస్తీక అని వ్రాసి, సర్పజాతిని కాపాడినవాడిని తలచుకోవడం జరుగుతుంది.*
---------------------------------------- 
*పాముల ఉపయోగాలు :*
*ప్రతి జీవి, ఇంకొక జీవికి ఏదోవిధంగా ఉపయోగపడుతూ ఉంటుంది . దీనినే సమన్వయ సహకారము (Symbiosis) అంటాము . అన్ని జీవుల మాదిరిగానే పాములూ 'జీవపరిణామ క్రమము' (Theory of Evaluation of species(life))లో భాగంగానే ఉద్భవించాయని అనడంలో సందేహము లేదు.*
---------------------------------------
*నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రింద ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.*
---------------------------------------- 
*ఒక విషయం గుర్తుంచుకోండి.పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్నిపాములూ పాలు త్రాగవని కాదు,* *దేవతాసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములుపాములు పాలుత్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా! దేవతా సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు.మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలులేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్దీ పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి, మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను* *పుట్టదగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణిచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి.* *పసుపుకుంకుమలను పుట్టదగ్గరవాడకండి.*
*పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడపమీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కాని, వెండితో కాని, కొయ్యతో(చెక్క) కాని, మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ, జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.*
---------------------------------------
*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.సర్పము అనగా కదిలేది , పాకేది.  నాగములో ‘న , అగ’* *ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా* *‘కాలనాగు’అని అంటారు.* 
----------------------------------------
*జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది.కార్తీకమాసములోనే మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.*
----------------------------------------
*కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  *నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 
----------------------------------------
*ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును ,పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ* *పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత.* 
---------------------------------------
*నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము"ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.*
----------------------------------------
*ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది.* 
----------------------------------------
*దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు.కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి" నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.*
----------------------------------------
*భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం.ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం.భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.*
*కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.*
----------------------------------------
*దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.*
----------------------------------------
*వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’*  *పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.*
--------------------------------------
*పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !*
-------------------------------------
*పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.*
----------------------------------------
*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* *అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.*
---------------------------------------
*పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.*
----------------------------------------
*ఆధ్యాత్మిక యోగా పరంగా :-ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను'* *వెన్నుపాము'అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో* *"పాము"ఆకారమువలెనే వుంటుందని* *"యోగశాస్త్రం"చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ'* *సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు'* *నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.*
--------------------------------------
*నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*
---------------------------------------
*పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.*
----------------------------------------
*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.*
----------------------------------------
*నాగుల చవితి మంత్రం*
*పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.*
*అనంత*
*వాసుకి*
*శేష*
*పద్మ*
*కంబాల*
*కర్కోటకం*
*ఆశ్వతార*
*ధృతరాష్ట్ర*
*శంఖపాల*
*కలియా*
*తక్షక*
*పింగళ*
*ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.*
---------------------------------------
*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*
-------------------------------------
*నడుము తొక్కితే నావాడు అనుకో* 
*పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 
*తోక తొక్కితే తోటి వాడు అనుకో* 
*నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 
----------------------------------------
*ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.*
----------------------------------------
*మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.*                                ----------------------------------------

No comments:

Post a Comment