Wednesday, 1 January 2025

కౌరవుల నామధేయాలు


కౌరవుల నామధేయాలు :

1. దుర్యోధనుడు, 2. దుశ్శాసనుడు, 3.దుస్సహుడు 4.దుశ్శలుడు, 5.జలసంధుడు, 6. సముడు, 7.సహుడు, 8. విందుడు, 9. అనువిందుడు, 10.దుర్దర్షుడు, 
11.సుబాహుడు, 12.దుష్పప్రదర్శనుడు, 13.దుర్మర్షణుడు, 1 4.దుర్ముఖుడు, 15.దుష్కర్ణుడు,16. కర్ణుడు,17. వివింశతుడు,18. వికర్ణుడు,19. శలుడు 20.సత్వుడు, 
21.సులోచనుడు, 22.చిత్రుడు, 23.ఉపచిత్రుడు, 24.చిత్రాక్షుడు, 25.చారుచిత్రుడు, 26.శరాసనుడు, 27.దుర్మధుడు, 28.దుర్విగాహుడు, 2 9.వివిత్సుడు, 30.వికటాననుడు, 
31.నోర్ణనాభుడు, 32.సునాభుడు, 33.నందుడు, 34.ఉపనందుడు, 35.చిత్రాణుడు, 36.చిత్రవర్మ, 37.సువర్మ, 38.దుర్విమోచనుడు, 39.అయోబాహుడు, 40.మహాబాహుడు, 
41.చిత్రాంగుడు, 42.చిత్రకుండలుడు, 43.భీమవేగుడు, 44.భీమలుడు, 45.బలాకుడు, 46.బలవర్ధనుడు, 47.నోగ్రాయుధుడు, 48.సుషేణుడు, 4 9.కుండధారుడు, 50.మహోదరుడు, 
51.చిత్రాయుధుడు, 52.నిషింగుడు, 53.పాశుడు, 54.బృందారకుడు, 55.దృఢవర్మ, 56.దృఢక్షత్రుడు, 57.సోమకీర్తి, 58.అనూదరుడు, 59.దృఢసంధుడు, 60.జరాసంధుడు, 
61.సదుడు, 62.సువాగుడు, 63.ఉగ్రశ్రవుడు, 64.ఉగ్రసేనుడు, 65.సేనాని, 66.దుష్పరాజుడు, 67.అపరాజితుడు, 68.కుండశాయి, 69.విశాలాక్షుడు, 70.దురాధరుడు, 
71.దుర్జయుడు, 72.దృఢహస్థుడు, 73.సుహస్తుడు, 74.వాయువేగుడు, 75.సువర్చుడు, 76.ఆదిత్యకేతుడు, 77.బహ్వాశి, 78.నాగదత్తుడు, 79.అగ్రయాయుడు, 80.కవచుడు, 
81.క్రధనుడు, 82.కుండినుడు, 83.ధనుర్ధరోగుడు, 84.భీమరధుడు, 85.వీరబాహుడు, 86.వలోలుడు, 87.రుద్రకర్ముడు ,88.దృఢరదాశ్రుడు, 89.అదృష్యుడు, 90.కుండభేది, 
91.విరావి, 92.ప్రమధుడు, 93.ప్రమాధి, 94.దీర్గరోముడు, 95.దీర్గబాహువు, 96.ఊడోరుడు, 97.కనకద్వజుడు, 98.ఉపాభయుడు, 99.కుండాశి, 100.విరజనుడు. నూట ఒకటవ కుండనుండి దుస్సల అనే ఆడపిల్ల జన్మించింది.

కృపాచార్యుడు ద్రోణాచార్యుడు దృపదుడు జన్మ వృత్తాంతం :
గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు .అతనికి వేదాధ్యనంలో ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సంపాదించాలని ఆశించి ఘోరమైన తపమాచరించాడు. అతని తపస్సు భగ్నంచేయడానికి ఇంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. ఆమెను చూసిన శర్వందుడు పరవశుడైనాడు. అతని చేతిలోని ధనుర్భాణాలు జారవిడిచాడు. అతనికి వీర్యపతనం జరిగి ఒక రెల్లు పొదలపై బడింది. శరద్వంతుడు తిరిగి తపస్సుకు వెళ్ళాడు. పతనమైన వీర్యం రెండు భాగాలుగా విడిపడి ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లవాడు జన్మించారు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కన ఉన్న ధనుర్భాణాలు, జింకచర్మాలు చూసి వారు బ్రాహ్మణ బాలురని గ్రహించి తీసుకు వెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపి, కృపుడు అని పేర్లు పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లలని చెప్పి కృపునకు ఉపనయనం చేసి ధనుర్విద్య నేర్పించాడు. కృపాచార్యుని భీష్ముడు పాండవ కౌరవులకు గురువుగా నియమించాడు. భరద్వాజముని గంగా తీరంలో తపసు చేసుకుంటున్నాడు.ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడు తున్నప్పుడు ఆమె వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజుడు చూసాడు. అది చూసిన భరద్వాజునకు వీర్యపతనం జరిగింది. అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో (కలశంలో) దాచాడు. ఆ వీర్యం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశ రాజైన పృషతుడు. అతడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసాడు. అతడికి ఒకరోజు మేనక అనే అప్సరసను చూసి వీర్యపతనం జరుగగా దాని నుండి దృపదుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాలదేశానికి వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు దృపదుడు కలసి విద్య నభ్యసించారు. దృపదుడు పాంచాల దేశానికి వెళ్ళి రాజయ్యాడు. దృపదుడు అగ్నివేశుని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుని చెల్లెలెలు కృపిని ద్రోణుడికి ఇచ్చి భరద్వాజుడు వివాహం చేసాడు. వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు. పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకుని ధనార్ధియై ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. కానీ అప్పటికే ధనమంతా దానంచేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశత్రాలను ప్రయోగం ఉపసంహారాలతో నేర్చుకున్నాడు. ఒక రోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకుని దృపదుని వద్దకు వెళ్ళాడు. దృపదుడు గర్వియై స్నేహమంటే సమాన అంతస్థు ఉండాలని పేద బ్రాహ్మణునితో స్నేహమేమిటని అవమానించి పంపాడు. ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం విడిచి హస్థినాపురానికి వెళ్ళాడు.

పాండవులు కౌరవుల విద్యాభ్యాసం :
ద్రోణాచార్యుడు హస్థినలో ప్రవేశించే సమయంలోజరిగిన సంఘటన ఆయనను పాండు సుతులకు కౌరవులకు గురువైయ్యేలా చేసింది. పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది. వారు దానిని తీయటానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన ద్రోణాచార్యుడు ఆ బంతిని ఒకదాని తరువాత ఒక బాణాన్

ని వేస్తూ బయటకు తీసి ఇచ్చాడు. రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని రాజకుమారులకు ఆ చార్యునిగా నియమించాడు. విద్య నేర్పడానికి ముందు అతడు రాకుమారులను చూసి మీలో నాకోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు. అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అన్నాడు. దేశదేశాల నుండి వచ్చిన రాకుమారులతో దృపదుని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యనభ్యసించ సాగాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడైయ్యాడు. అశ్వత్థామకు అర్జునుడంటే విద్యామత్సరం ఉండేది. ఒక రోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది. అర్జునుడు చీకటిలో అన్నంతింటూ ఉండగా చీకటిలో బాణప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు. అది చూసి ద్రోణుడు అర్జునుని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా నేర్పించాడు. దుర్యోధనాదులు భీముని బలం అర్జునిని విలువిద్యా నైపుణ్యం సహించలేక పోయారు. ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో పరీక్ష పెట్టాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరిని పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవరికీ తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు. ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక మొసలి అతని కాలును పట్టుకుంది. అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా దిక్కుతోచక పరుగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు. ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే దృపదుని పట్ల తనకు కలిగిన పగ చల్లార్చ గలడని గ్రహించి ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు.

ఏకలవ్యుడు :
ద్రోణుని కీర్తి విని హిరణ్యధన్వునుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు .అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని కోరాడు. హీనజాతి వాడికి విలు విద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు. పట్టువదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి భక్తితో విలు విద్యను సాధన చేసాడు. ఒక రోజు పాడవులు, కౌరవులు సమయంలో పాండవుల వేట కుక్క తప్పించుకు పోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మొరగ సాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు ఆబాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరచింది. వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి అతడు ద్రోణుని శిష్యుడని అతనిద్వారానే అడిగి తెలుసుకున్నారు. అర్జునుడు ద్రోణునితో గురువర్యా నేను మీ ప్రియశిషుణ్ణి అని చెప్పారు కదా నాకంటే ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు అని వేదనగా అడిగాడు. ద్రోణుడు అర్జునునితో ఏకలవ్యునికి దగ్గరకు వెళ్ళి అతని వద్ద గురుదక్షిణగా అతని బొటన వ్రేలిని గ్రహించి అ ర్జునిని జగదేక వీరునిగా చేసాడు.

No comments:

Post a Comment