Thursday, 3 October 2024
లగడపాటి భాస్కర్
లగడపాటి భాస్కరుడా... నీకు వందనాలు... తెల్లటి మేని చాయ మెలి తిరగని పొట్టి మీసం... తెల్ల దుస్తులు చిరు మందహాసం.. మిత భాష్యం అమిత పాండిత్యం... నామధేయాన్ని సార్ధకం చేశావు కావ్య భాస్కరుడైనావు... ఇంటి పేరు లగడపాటి కాదెప్పుడూ "జగడ"పాటి... తెలుగు పండితుడైనా అమిత భాషి కాదు చిరు మందహాసం మీకు దివ్యాభరణం... ఆకారం చూస్తే పొట్టి మనసు చూస్తే గట్టి... తెల్లటి దుస్తులతో స్వచ్ఛత మనసు చూస్తే మెతక.... అధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ రచనా వ్యాసంగానికి శ్రీకారం... కవులను కళాకారులను ఏకం చేశావు ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించావు... కవులకు సన్మానాలు సత్కారాలు కవిత్వానికి ఆదరణ అమర్చావు... ధూర్జటి రసజ్ఞ సమాఖ్య ఏర్పరిచావు ధూర్జటి గ్రంథాలయం కోసం ఉద్యమించావు .... ధూర్జటి విగ్రహం కోసం పట్టుబట్టావు కోరిక నెరవేరకనే పయనమయ్యావు... సహస్రావధాని మేడసాని మన్నన పొందావు సహస్ర రచనలకు జీవం పోశావు... మనిషి పొట్టి అయినా సంకల్పం మాత్రం బహు గట్టి... మీరు నాటిన కవిత్వాలు వికసిస్తున్నాయి భాస్కరుడిగా చూసి ఆనందించు... తొందరపడి వెళ్ళిపోయావు మరో లగడపాటిని పంపడం మరిచావు... అమర లోకంలోని లగడపాటి భాస్కరుడా అందుకో వందనాలు... అభివందనాలు... నీరాజనాలు... ఇట్లు మీ పూర్వ విద్యార్థి ... ముత్యాల వెంకటరమణ (ఎం.వి.రమణ) సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి...8341378799, 7013518299...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment