*🌸🕉శ్రీమద్దక్షిణ కైలాసం (శ్రీకాళహస్తి క్షేత్రము) ఈ క్షేత్రములో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదట జరిగే ధ్వజారోహణం లోకంలో దక్షిణ కైలాస శిఖరాగ్రం, కన్నప్ప కొండ అని కన్నప్ప ధ్వజారోహణం అని భక్తుణి పైన పెట్టి స్వామి క్రింద ఉన్నారు అని భక్తుల నానుడిలో ప్రచారంలో అలా వచ్చింది తప్ప యధార్థంగా అసలు విషయం వేరే అండి,ఈ క్షేత్రములో స్వామి రెండు స్వరూపములతో ఉన్నారు అని చెప్పారు స్థల పురాణం 74 వ అధ్యాయంలో 67 శ్లోకములో 🕉 శ్లో!! సమిష్టి వ్యష్టి భేదేన ద్వివిధంహి మహేశితుః !!👉సమిష్టి వ్యష్టి బేధముతో రెండు విధములుగా మహేశ్వరుడు ఈ క్షేత్రములో ఉన్నారు(సమిష్టి రూపము శివానందైక నిలయమైన పర్వతము వ్యష్టి రూపము దేవాలయం నందు ఉన్న శ్రీకాళహస్తీశ్వర లింగము)🕉శ్లో!! వ్యష్టే స్సమిష్టిరుత్కృష్టా కోటి కోటి గుణైధ్రువం!!👉వ్యష్టి రూపమైన శ్రీకాళహస్తీశ్వర లింగము కంటే సమిష్టి రూపమైన దక్షిణ కైలాసపర్వతము ఉత్కృష్టమైనది కోటి కోటి గుణములు కలది🕉శ్లో!!తస్మాద్గిరిరయం శంభో మహాదేహో పరోధ్రువం!తను స్సమిష్టి రూపాసా శివస్య పరమాత్మనః!వ్యష్టి లింగ స్థితోదేవః కాలహస్తీశ్వర ప్రభుః !!👉ఈ పర్వతమే నా(పరమేశ్వరుని) స్వరూపము అనడంలో సందేహం లేదు ఈ పర్వవతమే శివుని యొక్క శరీరంగా సమిష్టి రూపముతో ఉన్నది వ్యష్టి రూపమైన లింగము నందు ఉన్న స్వామి కాళహస్తీశ్వరుడు అని పురాణము నందు చెప్పడం వల్ల ఈ క్షేత్రములో మొదట వెలిసింది బ్రహ్మ దేవుని చేత ప్రతిష్టించబడిన శివుని సమిష్టి దేహమైన పర్వతము అందువల్ల అందువల్ల బ్రహ్మోత్సవాలలో మొదట పర్వత శిఖరాగ్రము నందు ఉన్న కైలాసనాథేశ్వరుని ధ్వజారోహణం చేసి తరువాత వ్యష్టి రూపంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామికి ధ్వజారోహణం చేయడం జరుగుతూ ఉన్నది సూక్ష్మంగా గమనిస్తే చూసిన వారికి కూడా తెలుస్తుంది పర్వతము పైన ఉన్న కైలాసనాధలింగానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికే జరుగుతుంది కానీ కన్నపకు కాదు కేవలం కన్నప్ప ఉత్సవ మూర్తి సాక్షిభూతంగానే ఉంటారు*
No comments:
Post a Comment