*🌸🕉శ్రీమదక్షిణ. కైలాసం(శ్రీకాళహస్తి క్షేత్రం) యొక్క ప్రశంస🕉🌸 🙏మంగళాచరణం🙏 🌸శ్లో:యన్నామ స్మరణం సమస్త జగతామైశ్వర్య సంపాదకం. యత్సందర్శన మాశుకోటి జననం ప్రాప్తాఘవిధ్వంసనం వేదైశ్చాపి నశక్యతే నిగదితుం యత్స్వానుభూతే సుఖం సోయంనః పరిపాతు నిత్యకృపయా శ్రీకాళహస్తీశ్వరః!!🌸 ఏ దేవుని యొక్క నామస్మరణము స్మరించినంత మాత్రముచేత ప్రపంచమునకు సమస్తమగు ఐశ్వర్యములు చేకూరగలదో, ఏదేవుని దర్శన మాత్రముచేత కోటి జన్మములలో చేసిన పాపము క్షణములో హరించగలదో, వేదములకు అతీతమైన తత్త్వమును కలిగిన వారును , ఏ స్వామి సందర్శనముచేత నిజమైనదియు అపరిమితమైన ఆనందం,సుఖము లభించునో అట్టి శ్రీకాళహస్తీశ్వరుని నిత్యకృపను భక్తులు పొందగలరు. 🌸శ్లో:కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వరశ్శివః కరోతు నిత్యకల్యాణం కరుణా వరుణాలయః!!🌸 ఈ క్షేత్రము దక్షిణ కైలాసం బని ఆర్యులు వ్యవహరించుచున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రమున నుండు శివలింగము పృథివ్యపేజోవాయురాకాశవులను పంచభూత లింగములలో వాయులింగంబని పురాణములు చెప్పుచున్నవి. కృతయుగంబున వాయు భట్టారకుడు,శ్రీకాళహస్తీశ్వరుని గూర్చి ఘోరతపం చేసి సర్వవ్యాపకత్వము మొదలగు వరములను పొందుటయే గాక, ఈ శివలింగమునకు వాయులింగంబని లోకమున ప్రసిద్ధి గల్గునట్లు వరమును పొందిన,అందుచే ఈ క్షేత్రం వాయు క్షేత్రం బనియు ప్రసిద్ధి గాంచెను. ఇందుకు తార్కాణముగా శివుని గర్భాలయమునందలి దీపకళికలలో రెండు జ్యోతి మాత్రమే సదా చలించుచున్నవై వాయు క్షేత్రం బడుటకు నిదర్శనంగా నున్నవి,సహస్ర శిఖరములతో నొప్పుచున్న ప్రసిద్ధ కైలాసము నుండి శివానందైక నిలయంబను నొక్క పర్వతమును , బ్రహ్మ దేవుడు తెచ్చి లోకానుగ్రహారమై మహేశ్వరుండిచట నివసింపచేసెను అని పురాణములో తెలుపబడినది,ప్రసిద్ధంబులగు శివ క్షేత్రాల కన్నింటికి శ్రీ కాళహస్తి క్షేత్రము తలమానికంబై వెలసియున్నది. 🌸శ్లో:భూమౌ దక్షిణ కైలాసే ప్రవేశాన్ముక్త ఏవసః!!🌸 అను ప్రమాణం, ఈ స్థల నివాసముచే ప్రాణులు ముక్తి. కరతలామలకమనియు, "కాశ్యాంతు మరణాన్ ముక్తి:"అనువచనము కాశ్యాది పుణ్యక్షేత్రములయందు మరణము నొందిననే గాని ముక్తి లభింపదనియు తెలియజేయు చున్నది. 🌸శ్లో:కైలాసః పంచధా ప్రోక్తా స్థానైశ్వర్యాది భేదతః!!🌸 అని ఆరంభించి,ఉక్తం తేభ్యోపి సర్వార్థ సాధనం పంచమం జగు: అని 🌸శ్లో:శ్రీమద్దక్షిణ కైలాస స్థానం సర్వజనాశ్రయం తపః కర్తుం యతో త్రైవ సుకరం నాన్యతో ధ్రువం!!🌸 అని సదాశివుని గూర్చి , జగసృష్టి సామర్థ సంపాదనార్థమై తపం బొనర్పదలచి తనని గూర్చి ప్రార్థించుచున్న బ్రహ్మను చూచి పంచవిధంబుల పేర్కొనబడిన కైలాసములలో ప్రాకృత ప్రశయముందు నశింపనదియు,శూలాగ్రముందు ధరింపబడిన శివానందైకనిలయం ఆను పర్వతము శృంగముతో ఉన్నది , అధి భూలోకములో గల శివ క్షేత్రాల కన్నింటికిమిన్నయై, విష్ణు ఇంద్రాది పూజింతబై స్వయం వ్యక్త నుగు శివలింగము భాసిల్లు శ్రీకాళహస్తి క్షేత్రంబున తపం బొనర్పు మని విధాతకు స్థలవైభనమును వివరించెను,మరియు శ్రీకాళహస్తి స్థల పురాణము నాల్గవ అధ్యాయం ఈ దివ్య స్థల ప్రశంసక్రింది రీతిని గావింపబడి యున్నది. 🌸శ్లో:శ్రీమద్దక్షిణ కైలాసాభిఖ్యం స్థలవరోత్తమం పునః ప్రోక్తాశేష ముక్తి విధానం కధితం పరం!! జ్ఞాన వైరాగ్యదం సాక్షాత్ శివ. సాయుజ్య కారణం తస్మాత్ సర్వోత్తమం స్థానం ఇదమేవ మునీశ్వరాః !! స్థలస్యై తస్య సదృశం న భూతం స భవిష్యతి ధ్యానాచ్చ కీర్తనాదస్య శ్రవణా వీక్షణా త్సకృత్!!స్పర్శనాత్సాపి నోప్యుక్త ఫలభాజో భవంతిహి అస్య స్థలస్య సదృశం యే వదంతి స్థలాంతరం!! తేయాంతి నరకం ఘోర మహారౌరవనమ్మకం!! శ్రీమద్దక్షిణ కైలాస కీర్తనాదేవ మానవ ముచ్యన్తే ఘోర సంసారా ద్ధేశాంతర గతాః అపి!! చండాళః పుల్కసోవాపి శృత్వా దేశాంతరే సకృత్ స్థలస్యై తస్య మాహాత్మ్యం సద్యో బంధాద్విముచ్యతే!!శ్రీమద్దక్షిణ కైలాస శిఖరాణి సమాశ్రితాః యత్ర దేశ ప్రవర్తంతే సాధవో ద్విజసత్త మా:!! తత్రత్య ప్రాణినాం ముక్తి : కిముతత్ర నివాసివాం స్థలం తద్భహుధోపాత్త కర్మనిర్మూలన క్షణం!!తాపత్రయార్క సంతప్త వర్షశాలి ఘనోపమం యత్రాస్తే భగవాన్ శంభుః జగతాం కారణం విభుః!! ఏశోర్విశసనస్థానం పాపాఖ్యిస్య మునీశ్వరా: స్థలం యచ్చ్రుతయో ముఖ్యాః ప్రమాణేషు వదంతిహి!! తస్మాత్తత్రైవ గంతవ్యం మోక్షమక్షయ మిచ్చతా!!🌸రోముశ మహర్షి భరద్వాజ మహర్షి చూసి తెలిపిన శ్రీకాళహస్తి క్షేత్ర ప్రశంసలు సూతపౌరాణికుడు శౌనకాది మహర్షులుకు యిట్లు వినిపించెను.శివక్షేత్రాలలో శ్రీమద్దక్షిణ కైలాసమను పేరుగల శ్రీకాళహస్తి క్షేత్రము అత్యుత్తమంబై జ్ఞానవైరాగ్యములకు మూలకందంబై సాక్షాత్ శివసాయుజ్యమునకు నిధానమై భాసిల్లుచున్నది. ఈ స్థలమునకు సమాన మగు స్థలం లేదు. ఇకపై కలుగబోదు. పాపాత్ములు కూడ ధ్యాన, శ్రవణ,కీర్తన, దర్శనములచేత సంపూర్ణఫలమును పొందుచున్నారు. ఎవరు ఈ స్థలమునకు స్థలాంతరము సమానమని పలికెదరో నారు మహా రౌరవమను నరకమును పొందుచున్నారు. దేశాంతరస్థులను మానవులు శ్రీమద్దక్షిణ కైలాసమును ఒక్కనూరు స్మరించిన చో వారు ఘోర సంసార బంధమునుండి విముక్తులగు చున్నారు. దేశాంతర గతుడగు చండాలుడుగాని, పుల్కసుడుగాని,ఒకసారి ఈ క్షేత్ర మహిమలు వినినచో వాడు సంసారబంధ విముక్తులై సద్గతి పొందగలరు ,శ్రీమద్దక్షిణ కైలాస శిఖరముల నాశ్రయించి యుండు సాధుసత్తములగు బ్రాహ్మణోత్తములు యేదేశమునందు నివసించు చున్నారో అచ్చటి వారందరు ముక్తి పొందుచున్నారు. ఇక నా క్షేత్రము నందు నివసించు మహాత్ములకు ముక్తి కరతలామలక మగునని వేరుగా చెప్పవలసినది లేదు బహుజన్మాంతర కర్మనిర్మూలన చేయు ఈక్షేత్రం ఆధ్యాత్మిక,ఆది దైవిక, ఆది భౌతిక, తాపత్రయమైన మానవులకు వృష్టి ప్రదమై మేఘతుల్యమై భాసిల్లుచున్నది. పాప పశు సంహారక స్థానం శ్రీకాళహస్తి క్షేత్రము అని శ్రుతులు ఘోషించుచున్నవి. కావు, అక్షయ్య మగు ముక్తిని గోరువారు శ్రీ కాళహస్తి క్షేత్రమునకు పోవలయును నీవు అక్కడికి వెళ్ళుమని రోమ మహర్షి భరద్వాజ మహర్షికి తెల్పెను అని సూతపౌరాణికుడు శౌనకాది మహర్షుల విశదీకరించెను . ఈ క్షేత్రం యొక్కమహిమను కొనియాడుటకు పరమశివుని కొక్కనికే తప్ప మరెవ్వరికి సాధ్యముగాదు అని తెల్పెను. 🌸శ్లో:కృతే బ్రహ్మపురం నామ్నా స్థలం త్రేతాయుగే పునః మునే విష్ణుపురాభిఖ్యం ద్వాపరే నారదాహ్వయం కలౌవర గుణాభిఖ్యం సర్వేషువ యుగేషుచ!!🌸 అని శ్రీకాళహస్తి నగరం. విఖ్యాతం అయ్యింది కృత యుగము బ్రహ్మపురమనియు, త్రేతాయుగము విష్ణు పురమనియు, ద్వాపరయుగము నారదపురమనియు, కలియుగమున వరగుణపురమనియు శ్రీకాళహస్తి క్షేత్రము నకు నామధేయము మారుచున్నది. 🌸శ్లో:స్వర్ణవర్ణం కృతే త్రేతాయుగే రౌప్య సమప్రభం ద్వాపరే లోహ సదృశం కలౌ ప్రస్తార సన్నిభం!!🌸 అని కృతాది చతుర్యుగములయందు ఈ క్షేత్ర నామధేయము మారినట్లు శివలింగం యొక్క పర్ణములు కూడ భేదము చెందుచున్నవి, ఈ సదాశివ లింగము కృత యుగము హేమమయముగాను, త్రేతాయుగము రజతపడుముగాను, ద్వాపరయుగము లోహమయముగాను, కలియుగమున ప్రస్థం (శిలా) రూపమున భక్తులకు దర్శనం ఇచ్చి కృతార్థులను జేయుచున్నదని స్థలపురాణము చాటుచున్నది. ఇందు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,వశిష్ఠాగస్త్యాది మునీంద్రులు, లూతవాతాశన హస్యాటక తిర్యగంతువులు శ్రీకాళహస్తీశ్వరుని ఆరాధించి కృతారులైరి. వీరే గాక లెక్కకు మించి మహాత్ములెందరో కృతాది యుగములయందు పరమేశ్వరుని సేవించి ముక్తి పొందెను స్థలపురాణము తెలుపుచున్నది. 🌷(కృతయుగము)🌷 🌸శ్లో:బ్రహ్మాగస్త్య: పార్వతీచ నీలాహరహరోమునే మయూర భీమ చంద్రార్క శక్రాస్చైతే దశ క్రమాత్!! స్థలే తత్ర తపః కృత్వా ప్రసాదాత్ పరమేశితుః కృతయుగే భవత్పుణ్య సంప్రాప్తాత్మ మనోరథాః !!🌸 🌷(త్రేతాయుగము)🌷 🌸శ్లో;హరిబ్రహ్మాచ లక్ష్మీశ్చ స్కందో రామో మృకండుజు: కిరాతలూత కాలేభా రేఖా స్చక్రం స్చైకాదశక్రమాత్ !! ఏతే త్రేతాయుగే తత్ర తపశ్శుద్ధా స్థలోత్తమే మునే శివ ప్రసాదేన సంప్రాప్తాత్మ మనోరణ:!!🌸 🌷(ద్వాపరయుగము)🌷 🌸శ్లో: సుభగా విజయశ్చైవ జపాలాచ మునీశ్వర మృత్యుంజయో నారదశ్చ పరాశర సుతాత్మజః!!సనత్కుమార శ్శక్తి పుత్ర త్రిదశానాం సహస్రకం సర్వైతే ద్వాపరే తత్ర శివాత్సంప్రాప్త వాంఛితా!!🌸 🌷(కలియుగము)🌷 🌸శ్లో:సారంగో వరగుణో రాజేంద్రో నీలకంఠకః తత్ర చక్రధర: కన్యా యుగళం పద్మసేనకః!! ఏతే సప్తపురా: శంభు కృపయా ప్రాప్త వాంచిత అన్యే చ బహువ స్సంతి భక్తా: పావనమూర్తయః!! కృపయా తత్ర దేవస్య పరయా ప్రాప్తి వాంఛితా:కలౌ యుగే ముని శ్రేష్ఠ తేషాం సంఖ్యా నవిద్యతే!!🌸 కృతయుగమున బ్రహ్మ, అగస్త్యుడు, పార్వతీదేవి, నీలా, హరహరుడు, మయూరుడు,భీముడు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, ఈ పదం గురు క్రమంగా శ్రీకాళహస్తీశ్వరానుగ్రహముచే ఇష్టార్థ సిద్ధిని బడసిరి.త్రేతాయుగమున హరి, బ్రహ్మ, లక్ష్మి, కుమారస్వామి,శ్రీరామచంద్రుడు,మార్కండేయుడు, కన్నప్ప, సాలీడు, కృష్ణసర్పం, ఏనుగు సుదర్శన చక్రము ఈ పదకొండు భక్తులు ఈశ్వరుని సేవించి ఇష్టార్థములను పొందిరి.ద్వాపరయుగమున ,శుభగ, విజయుడు, జపాల, మృత్యుంజయుడు, నారదుడు,శుకుడు, సనత్కుమారుడు, పరాశరుడు, సహస్ర దేవతలు, వీరు శ్రీకాళహస్తీశ్వరానుగ్రహముచేత తమ మనోరథములను పరిపూర్తిగావించుకొనిరి.కలియుగమున సారంగుడు, వరగుణుడు, రాజేంద్ర చోళుడు, నీలకంటుడు,చక్రధరుడు, అమృత లతాకాంతిమంతులు, పద్మసేనుడు అనే ఈ ఏలురు శ్రీ కాళహస్తీశ్వర కృపకు పాత్రులైరి.ఈ క్షేత్రము శివ క్షేత్రాలలో అతి ఉత్తమమైనది అందుకు తార్కాణంగా ఈ కైలాసపర్వతమునందు సదాశివగూహ అనియు, యక్షగూహ అనియు నామాంతరములతో చిద్గుహ అను పేర్లతో విరాజిల్లుచున్నది. అందు చిఛ్చక్తి సహితుడగు సదాశివుడు సహస్ర దేవతల యొక్క శక్తి పరీక్షార్థమై నిలచి, ఒక తృణము చేత వారి గర్వమును నిర్మూలించి, తదనుగ్రహమై ప్రతి వత్సరము బ్రహ్మవిష్ణు ఇంద్రాది దేవతా సంఘమునకు దర్శనం బొసంగుచున్నట్లు స్థలపురాణముందలి ఎనభైఒకటవ అధ్యయ ముందు నిరూపింపబడి యున్నది. వేదమాత ఈఅర్ధమును దశోపనిషత్తులలో రెండవది యగు కేనోపనిషత్ తృతీయ ఖండమున విస్తరింపజేసిన ఈ స్థల వైభవనమును తెలియజేయుచున్నది,మరియు డెభై నాలుగవ అధ్యాయం నందు స్కందుడు శివాజ్ఞాను సారంగా వృషేంద్ర వాహనత్యాధి శివధర్మములను నది,అద్రి,విపిన, క్షేత్ర, శివలింగముల మహాత్మ్యమును యధావిధిగా నారదునకు వినిపించి, ఓ నారదా ఇందొక రహస్యముకలదు వినిపించెదను,సావధానముగా వినుము భూమండలమునందుగల సర్వ క్షేత్రములలో శ్రీకాళహస్తి భాస్కర క్షేత్రముని యెఱుంగుము అని ఆరంభించెను 🌸శ్లో:చత్వారో హేతవో యత్ర స్థలేత్యంత శుభావహే శివ సంపూర్ణ సాన్నిధ్య క్షేత్రం తదితి విద్దితత్!! పాదమాత్రం తు సాన్నిధ్యం తత్రయత్ర మహేశితుః. లింగం తుంగం మిశ్రుతంచ దృశ్యతే అకృత్రిమం మునే!!బ్రహ్మవిష్ణుశ్చ శక్రశ్చ యదిత ల్లింగపూజకాః విద్ది తత్రార్థ సాన్నిధ్యం స్థలే దేవస్య శూలినః!! మహాగిరి సముద్భూతా పుణ్యేనేకా పగాయుతా శివ విష్ణు స్థలోదార తీర యుగ్మ విరాజిత!! ఉత్పత్తి స్థల మారభ్య చాసముద్రం మునీశ్వరా ఏకసంజ్ఞా సదా దృష్ట ప్రవాహార్ణావ గామినీ:!! పదేపదే పుణ్యతీర్ధా నదీ తత్రాస్తి చేచ్చుభం. విద్ధి త్రిపాద సాన్నిధ్యం శివస్య పరమాత్మనః!! గిరిర్యత్ర మహేశస్య వర్తతే లోక విశ్రుతః సమిష్టి దేహ సకల దేవ ఋష్యాది వందితా!! అనేక పుణ్యతీర్ధాడ్యో నానాధాతు శిలాంచితః. నిత్య: కీర్తన వీక్షాద్యై పాపహా హృగ్హుహోజ్వలః!! తత్ర సంపూర్ణ సాన్నిధ్యం విధ్యుమేశస్యభో మునే తద్విద్ధి భాస్కర క్షేత్రం సర్వలోకేషు విశ్రుతం!!🌸 ఓ నారదా,నాల్గ హేతువులతో ఉండే అత్యంత శుభదాయకముగా ఉన్న క్షేత్రంలో శివుడు సంపూర్ణ సాన్నిధ్యమును చేయును దాన్ని భాస్కర క్షేత్రమని మహర్షులచే చెప్పబడినది, ఆ హేతువులను నీకు వివరించెదను. 1) అత్యున్నతమై, ప్రసిద్ధమై, అకృత్రిమమైన(ఒకరిచే చేయబడని స్వతసిద్దముగా వెలసిన) శివలింగముతో ఉన్న క్షేత్రమున శివుడు పాదయాత్ర సాన్నిధ్యము ఉంటారు (ఒకభాగంగా ). 2) ముందు చెప్పిన లక్షణములు కలిగి ఉండి హరిబ్రహ్మఇంద్రాదులచే పూజింపబడిన శివలింగముగల క్షేత్రమున సదాశివుడు అర్థ సాన్నిధ్యము చేయును. 3)పై చెప్పిన లక్షణములతో సహితంగా పురాణ(పుణ్య) ప్రసిద్దమైన పర్వతములో ఉద్బవించి ,అనేక పుణ్యతీర్థములు కలిగి ఉండి ఉభయ అనది యొక్క ఉభయ తీరముల యందు శివకేశవ క్షేత్రములతో విరాజిల్లుతూ , ఉత్పత్తి స్థలము (పుట్టిన దగ్గర నుంచి)మొదలుకొని సముద్ర పర్యంతము ఒక్క పేరుతో పిలువబడుతూ అవిచ్చిన్నమగు ప్రవాహముతో ఉండి , సముద్రగామినియై అచ్చటచ్చట పుణ్యతీర్ణములతో విరాజిల్లుతూ నదీప్రవాహము కలిగిన క్షేత్రమున శివుడు త్రిపాద సాన్నిధ్యముగా ఉంటారు. 4)పై చెప్పిన మూడు లక్షణములు కలిగి ఆ క్షేత్రములో ఉన్న పర్వతము శివునకు సమిష్టి దేహముగా ఉండి లోక ప్రసిద్దమై సమస్త దేవ ఋష్యాదుల చేత కీర్తించబడి ఆ పర్వతములో అనేక పుణ్యతీర్థములు కలిగి ఉండి,నానావిధ ధాతువులు కలిగి ఉండి విచిత్రమగు చిద్గుహ(సదాశివ గుహ,లేక యక్షగుహ )తో ప్రకాశించుచూ దర్శన స్మరణాదులచేత పాపసంహారము చేయుచున్న క్షేత్రమందు పరమేశ్వరుడు సంపూర్ణ సాన్నిధ్యంగా ఉండును. అట్టి క్షేత్రము "భాస్కర క్షేత్రము" అని తెలుపబడినది.ఈ లక్షనణములు అన్ని కలిగి ఉండుటచేత శ్రీకాళహస్తి మహోత్క్రుస్టమైన క్షేత్రంగా తెలుపబడింది, అందువల్ల ఈ క్షేత్రంలోకి ప్రవేశించి స్వామిని దర్శించి,సేవించిన వారికి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీస్వర స్వామి వారి అనుగ్హము లభిస్తుంది అనడంలో సందేహం లేదు*