Sunday, 26 August 2018

శ్రీ వీరఆంజనేయ స్వామి


భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు. ఆయన ఉన్న చోట లక్ష్మీ కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు. అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు.

ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అందుకు ప్రతీకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి.
త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.

No comments:

Post a Comment