Sunday, 26 August 2018

శ్రీ వీరఆంజనేయ స్వామి


భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు. ఆయన ఉన్న చోట లక్ష్మీ కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు. అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు.

ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అందుకు ప్రతీకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి.
త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.

Sunday, 19 August 2018

శ్రీకాళహస్తీ

శ్రీ కాళహస్తి ప్రముక్యత:

బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించిన ఆర్పలేకపోయిన శివ జ్యోతి ... నేటికీ అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది ...

పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు.కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం.గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు.అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు.అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.

24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది.అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతు వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది.అప్పుడు స్వామి వారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యెక పూజలు చేయమని అర్చకులకు మనవి చేసాడు.తనని ఆలయంలోకి తీసుకెళ్ళమని చెప్పి అక్కడ స్వామి వారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది.

అంతే కాకుండా ఈ స్వామి వారిని ఒక శ్రీ - సాలెపురుగు , కాళము - ఒక పాము , హస్తి - ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.

శ్రీ కాళహస్తి మహత్యం:

తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం

ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.

అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.

తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ''అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా'' అని పిలిచాడు.

మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.

అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ''మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.

మహాశివుడు చిరునవ్వు నవ్వి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.

శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది.

రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.

తిన్నడు మరింత దుఃఖిస్తూ, ''శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..'' అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.

అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.

తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు. పేరు కన్నాప గా నామా కారణం చేయడం జరిగింది.
అప్పటి నుండీ ఆలయం లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో మొదటి పూజ కన్నాప తో మొదలు పెడతారు.

ఓం నమః శివాయ
కైలాసి భగవాన్ శ్రీ కాళహస్తి ఈశ్వర శివ కరోతి నిత్య కల్యాణ కరుణ వరుణ లయహః.
ఒం నమః శివాయనమః

Wednesday, 15 August 2018

తిరుమల అష్ట దిగ్బంధం

*అష్టబంధనం - అష్టదిక్కుల్లో సంధిబంధనం*

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తి (ధృవమూర్తి) పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు ఎనిమిది వైపులా సంధిబంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఋత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. అదేవిధంగా, ఉదయం 6 నుండి 12 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగు మహర్షి రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంథంలో ఇలా వివరించారు.

*''శంఖచూర్ణం, మధూచ్ఛిష్టం, లాక్షా త్రిఫలమేవ చ|*

*కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్తశిలాకృతమ్‌||*

*మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృత:||''*

8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో 1.శంఖచూర్ణం - 25.5 తులాలు, 2.మధుజ (తేనెమైనం)- 3.5 తులాలు, 3.లాక్షా(లక్క) - 3.75 తులాలు, 4.గుగ్గులు(వృక్షపు బంక)- 9 తులాలు, 5.కార్పాసం(ఎర్ర పత్తి)- 1 తులం, 6.త్రిఫలం(ఎండిన    ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ)- 7.5 తులాలు, 7.రక్తశిలాచూర్ణము (గైరికము)- 7.5 తులాలు, 8.మాహిష నవనీతము (గేదె వెన్న) - 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

*శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని  ఆరాధిస్తారు.*

ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయారవుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు.