Tuesday, 2 October 2018

వెంకటేశ్వర స్వామి

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

భారత దేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కాడ మనికి కనిపించవు. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం కూడా అదే కోవకు వస్తుంది. సాధారణంగా మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు పూజారి హారతి ఇచ్చే సమయంలో మూలవిరాట్టును చూసే ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథనంలో హారతి ఇచ్చే సమయంలో ఆ మూలవిరాట్టు కన్నులు విప్పారుతాయి. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం, చెన్నై

ఈ దేవాలయం చెన్నైలోని నెరుకుండ్రలోని కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం. ఇక్కడ మూలవిరాట్టు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు. విగ్రహం నల్లని రంగులో ఉండటాన్ని మనం గమనించవచ్చు.
 
ఇక్కడ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసారని కొంతమంది చెబితే మరికొంతమంది లేదు ఇది ప్రతి ష్టించిన విగ్రహం అని చెబుతారు. ఇక ఇక్కడ వేంకటేశ్వరుడితో పాటు శ్రీ దేవి, భూదేవి కూడా ఉన్నారు.

ఈ దేవాలయంలో దేశంలో మరెక్కడా లేనట్లు హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆర్పివేస్తారు. దీంతో గర్భగుడి మొత్తం చిమ్మచీకటిగా మారిపోతుంది.

   అటు పై పూజారి హారతి పళ్లాన్ని దేవుడి మొహం సమీపంలోకి తీసుకువచ్చిన తక్షణం మూలవిరాట్టు నేత్రాలు విశాలమవుతాయి. దీంతో స్వామివారు నేరుగా ఆ హారతిని చూస్తున్నారా? అని పిస్తుంది.

   ఈ విధంగా హారతి ఇచ్చే సమయంలో స్వామివారు కళ్లు తెరవడం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. మిగిలిన సమయంలో స్వామివారు కళ్లు మూసుకున్న స్థితిలోనే మనకు కనిపిస్తారు.

   దీనిని స్వామివారి మహిమ అని కొంతమంది చెబుతారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ విగ్రహం చెక్కిన శిల్పి నైపుణ్యమని చెబుతారు. కరి వరదరాజ పెరుమాల్ దేవుడిని 27 నక్షత్రాల దేవుడని పిలుస్తారు.

   అంతేకాకుండా తొమ్మిది దేవుడని కూడా పిలుస్తారు. భక్తులు తమ కోరికను స్వామివారికి తెలిపి తొమ్మిది రుపాలయలు దక్షిణగా వేస్తే వెంటనే ఆ కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.

   కోర్కెలు నెరవేరిన తర్వాత వరుసగా తొమ్మిది రోజుల పాటు మరలా ఈ దేవాలయానికి వచ్చి దేవుడికి పూజలు చేయిస్తారు. విష్ణుపురాణంలో చెప్పినట్లు గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం ఇదే అని చెబుతారు.

   గజేంద్రుడి కాలును పట్టుకొన్న మొసలిని సంహరించిన ప్రదేశం ఇదేఅని ఇక్కడి వారి నమ్మకం. ఈ దేవాలయం సుమారు 1100 ఏళ్లకు పూర్వం నాటిదని చెబుతారు

   ఇక్కడ రామానుజాచార్యులు, ఆంజనేయస్వామికి ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం చెన్నైలోని కొయంబీడు బస్ స్టేషన్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

   ఈ దేవాలయం గురించి ఎక్కువ మందికి తెలియదు. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఇక్కడ మనకు కనిపించరు. అందువల్ల మనం స్వామివారి మహిమను ఎన్నిసార్లైనా కళ్లారా చూడవచ్చు.
గోవింద గోవిందా.....

Saturday, 8 September 2018

Confidence

http://thypsychology.blogspot.com/2018/09/the-secret-of-self-confidence-revealed.html?m=1

Sunday, 26 August 2018

శ్రీ వీరఆంజనేయ స్వామి


భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు. ఆయన ఉన్న చోట లక్ష్మీ కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు. అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు.

ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అందుకు ప్రతీకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి.
త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.

Sunday, 19 August 2018

శ్రీకాళహస్తీ

శ్రీ కాళహస్తి ప్రముక్యత:

బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించిన ఆర్పలేకపోయిన శివ జ్యోతి ... నేటికీ అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది ...

పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు.కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం.గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు.అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు.అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.

24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది.అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతు వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది.అప్పుడు స్వామి వారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యెక పూజలు చేయమని అర్చకులకు మనవి చేసాడు.తనని ఆలయంలోకి తీసుకెళ్ళమని చెప్పి అక్కడ స్వామి వారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది.

అంతే కాకుండా ఈ స్వామి వారిని ఒక శ్రీ - సాలెపురుగు , కాళము - ఒక పాము , హస్తి - ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.

శ్రీ కాళహస్తి మహత్యం:

తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం

ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.

అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.

తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ''అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా'' అని పిలిచాడు.

మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.

అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ''మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.

మహాశివుడు చిరునవ్వు నవ్వి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.

శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది.

రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.

తిన్నడు మరింత దుఃఖిస్తూ, ''శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..'' అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.

అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.

తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు. పేరు కన్నాప గా నామా కారణం చేయడం జరిగింది.
అప్పటి నుండీ ఆలయం లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో మొదటి పూజ కన్నాప తో మొదలు పెడతారు.

ఓం నమః శివాయ
కైలాసి భగవాన్ శ్రీ కాళహస్తి ఈశ్వర శివ కరోతి నిత్య కల్యాణ కరుణ వరుణ లయహః.
ఒం నమః శివాయనమః

Wednesday, 15 August 2018

తిరుమల అష్ట దిగ్బంధం

*అష్టబంధనం - అష్టదిక్కుల్లో సంధిబంధనం*

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తి (ధృవమూర్తి) పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు ఎనిమిది వైపులా సంధిబంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఋత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. అదేవిధంగా, ఉదయం 6 నుండి 12 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగు మహర్షి రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంథంలో ఇలా వివరించారు.

*''శంఖచూర్ణం, మధూచ్ఛిష్టం, లాక్షా త్రిఫలమేవ చ|*

*కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్తశిలాకృతమ్‌||*

*మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృత:||''*

8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో 1.శంఖచూర్ణం - 25.5 తులాలు, 2.మధుజ (తేనెమైనం)- 3.5 తులాలు, 3.లాక్షా(లక్క) - 3.75 తులాలు, 4.గుగ్గులు(వృక్షపు బంక)- 9 తులాలు, 5.కార్పాసం(ఎర్ర పత్తి)- 1 తులం, 6.త్రిఫలం(ఎండిన    ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ)- 7.5 తులాలు, 7.రక్తశిలాచూర్ణము (గైరికము)- 7.5 తులాలు, 8.మాహిష నవనీతము (గేదె వెన్న) - 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

*శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని  ఆరాధిస్తారు.*

ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయారవుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు.

Wednesday, 21 February 2018

శ్రీ కాళహస్తిశ్వర స్వామి జ్ఞానప్రసూనంబ అమ్మవారి పల్లకి ఉత్సవం

శ్రీ కాళహస్తిశ్వర స్వామి జ్ఞానప్రసూనంబ అమ్మవారి పల్లకి ఉత్సవం

శ్రీ కాళహస్తిశ్వరస్వామి జ్ఞానప్రసూనంబ ఏకాంత సేవా

Monday, 12 February 2018

ॐ ఓం నమః శివాయ ॐ* ఈరోజు మహాశివరాత్రి! మహాశివరాత్రి వృత్తాంతం మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు. బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మకు శాపము శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు. మొగలి పువ్వుకు శాపము ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు. కామధేనువుకు శాపము అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి. శివరాత్రి పర్వదినం ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు. జాగరణము జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము *ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*

Saturday, 10 February 2018

శ్రీ కాళహస్తి చరిత్ర నేను తెలియ చేయాలని మీకు ఈ క్రింది ఫోటో లో ప్రచురిస్తున్న 

Friday, 26 January 2018







                                            IN FEBRUARY 8TH ONWARDS MAHA SHIVARATRI BRAMOVATHSALU  STARTING UPTO 20TH