Monday, 26 August 2024

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన జననం సమాచారం


 5253 వ శ్రీకృష్ణ జన్మాష్టమి జయంతి శుభాకాంక్షలు

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని. 
8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 
27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. 
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

Wednesday, 21 August 2024

హనుమంతుడిని మంగళవారం నాడే ఎందుకు పూజిస్తారు..



🌺 హిందీలో, మంగళవారాలను మంగళవర్ అని పిలుస్తారు, అంటే పవిత్రమైన రోజు. 

🌺 ఫలితంగా, మంగళవారం, ప్రజలు హనుమంతునికి అంకితమైన ఆలయాలకు వెళతారు. ఆయనను ఆరాధించడం ద్వారా ఆనందం, బలం మరియు ధైర్యాన్ని పొందవచ్చు.

🌺 హనుమంతుడు శివుని స్వరూపమని నమ్ముతారు. కేసరి మరియు అంజనల కుమారుడైన హనుమంతుడు హిందూ మాసం చైత్ర పౌర్ణమి సందర్భంగా మంగళవారం నాడు జన్మించాడు.

🌺 దీని ఫలితంగా మంగళవారం నాడు శ్రీ హనుమంతుని పూజిస్తారు. హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు, ఇది అతని అమరత్వాన్ని సూచిస్తుంది. 

🌺 హనుమంతుడు శ్రీరాముని భక్తుడైన అనుచరుడు మరియు అతని శక్తి మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు.

🌺 మాతా అంజన తన పుట్టిన వార్తను గాలి దేవుడి నుండి స్వీకరించినందున అతనిని పవన్ పుత్ర అని కూడా పిలుస్తారు, అతను శివుడి ఆశీర్వాదాలను కూడా పొందాడు.

🌺 సీత మరియు శ్రీరాముడు రావణుడితో యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చారు. వారికి ప్రశంసా సంజ్ఞ అందించడం ద్వారా, తమ పక్షాన పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ సత్కరించారు. 

🌺 హనుమాన్ ఆరాధనకు వారంలోని ఏ రోజు అయినా ఆమోదయోగ్యమైనది, అయితే మంగళవారాలు అదృష్టవంతంగా కనిపిస్తాయి. 

🌺 హనుమంతుడిని ఆరాధించడం ద్వారా విజయం, ప్రశాంతత, ఆనందం, బలం, ధైర్యం లభిస్తాయి.


Saturday, 3 August 2024

కాశి ఆలయ చరిత్ర

*కాశి ఆలయ చరిత్ర*

👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 

👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*

👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*

👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*

👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*

👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*

👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*

👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*

👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*

👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*

👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*

👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*

👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*

👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*

👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*

👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*

👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*

👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*

👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*

👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 

👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*

👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*

👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*

👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*

👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*

👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*

👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*

అర్జున ఫాల్గుణ అని పలికే

*🌳అర్జునా… ఫల్గుణా..!⛈️*
                
*పిడుగులు పడుతున్నప్పుడు ‘అర్జునా - ఫాల్గుణ’ అని ఎందుకు జపించాలి? అసలు ఫాల్గుణ అనే నామానికి అర్థం ఏమిటి?*

*పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో పలురకాల వృత్తులలో ఉంటూ అక్కడే బసచేశారని మీకు తెలిసినదే.*
              
*అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు.* 

*పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడికి దిగుతారు.*

*అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు.* 

*అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు.* 

*రాజకుమారుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.*

*అయితే భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు.*

*అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉంటాయి.* 

*ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.*

*గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని, ఎంతటి వీరుడినైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని, దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరిటి అని అంటారని, కుంతీ దేవి అసలు పేరు పృథ, ఆమెకు జన్మించడం వలన పార్ధ అంటారని, ఇక ఉత్తర ఫల్గునీ నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడిని నమ్మిస్తాడు.*

*ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం ఆగుతుందని, అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు.*

 సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు

Friday, 2 August 2024

తిరుమల ఏడుకొండల పరమార్ధం


1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.

అందుకనే ఆయన ఏడుకొండలు పైన ఉంటాడు. ఈ ఏడుకొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ ఏడుకొండలు సాలగ్రామాలే. ఆ ఏడుకొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అబద్దం ఇంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.

పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.

కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.

అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,

తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) 

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.

వేంకటాచలం లో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు.