Wednesday, 27 November 2019

గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో ‘నిష్కలం
క_మహాదేవ ఆలయం’ఉంది.

ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి శివ లింగానికి పూజలు చేస్తారు.

ఇలా రాత్రి పదిగంటల వరకూ అక్కడే కాలం గడపొచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. అంటే మళ్లీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి.

కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది.

Friday, 15 November 2019

సురుటుపల్లి

🌼🌿* సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తూన్న శివుని అరుదైన దేవాలయం.🌼🌿

పరమశివుడు కొలువైన క్షేత్రం .. ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం ‘సురుటుపల్లి’. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది. సాధారణంగా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమహా విష్ణువు మాత్రమే శయనభంగిమలో దర్శనమిస్తుంటాడు. శివుడు మాత్రం లింగరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

సదాశివుడు కూడా శ్రీమహా విష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే ‘సురుటు పల్లి’. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. ఈ సంఘటన కారణంగా కోటి మంది దేవతలు అక్కడికి చేరుకున్నారు.

* ఆశలు తీర్చే అభిషేకం

పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి. స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి.

సాధారణంగా దాదాపు అన్ని శివాలయాల్లోనూ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.

* బుక్కరాయలు నిర్మించిన ఆలయం:

తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కావుకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా పేర్కొన్నారు.

* గరళకంఠుడు సేదదీరిన నేల:

క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టుకు వచ్చినప్పుడు భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిలోక రక్షణాదక్షుడైన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. గరళం కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి పతి గొంతును నొక్కిపట్టి ఉంచింది. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు.

నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నార ని… ఈ కథనాన్ని శివపురాణం చెబుతోంది.

కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే చాలు సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పల్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు.

Friday, 8 November 2019

సుబ్రమణ్య స్వామి క్షేత్రలు

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.

ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.

క్రింద చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు. ఇప్పుడు కేవలం ఆ ఆరు క్షేత్రాలనూ భక్తితో తలచుకుంటున్నాము

తిరుచందూర్
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.

స్వామిమలై
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.

పళని
ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

తిరుత్తణి
తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.

పరిముదిర్ చోళై
దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.

తిరువరన్ కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.

పైన చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు

ఓం శం శరవణభవ