Tuesday, 2 October 2018

వెంకటేశ్వర స్వామి

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

భారత దేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కాడ మనికి కనిపించవు. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం కూడా అదే కోవకు వస్తుంది. సాధారణంగా మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు పూజారి హారతి ఇచ్చే సమయంలో మూలవిరాట్టును చూసే ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథనంలో హారతి ఇచ్చే సమయంలో ఆ మూలవిరాట్టు కన్నులు విప్పారుతాయి. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం, చెన్నై

ఈ దేవాలయం చెన్నైలోని నెరుకుండ్రలోని కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం. ఇక్కడ మూలవిరాట్టు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు. విగ్రహం నల్లని రంగులో ఉండటాన్ని మనం గమనించవచ్చు.
 
ఇక్కడ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసారని కొంతమంది చెబితే మరికొంతమంది లేదు ఇది ప్రతి ష్టించిన విగ్రహం అని చెబుతారు. ఇక ఇక్కడ వేంకటేశ్వరుడితో పాటు శ్రీ దేవి, భూదేవి కూడా ఉన్నారు.

ఈ దేవాలయంలో దేశంలో మరెక్కడా లేనట్లు హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆర్పివేస్తారు. దీంతో గర్భగుడి మొత్తం చిమ్మచీకటిగా మారిపోతుంది.

   అటు పై పూజారి హారతి పళ్లాన్ని దేవుడి మొహం సమీపంలోకి తీసుకువచ్చిన తక్షణం మూలవిరాట్టు నేత్రాలు విశాలమవుతాయి. దీంతో స్వామివారు నేరుగా ఆ హారతిని చూస్తున్నారా? అని పిస్తుంది.

   ఈ విధంగా హారతి ఇచ్చే సమయంలో స్వామివారు కళ్లు తెరవడం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. మిగిలిన సమయంలో స్వామివారు కళ్లు మూసుకున్న స్థితిలోనే మనకు కనిపిస్తారు.

   దీనిని స్వామివారి మహిమ అని కొంతమంది చెబుతారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ విగ్రహం చెక్కిన శిల్పి నైపుణ్యమని చెబుతారు. కరి వరదరాజ పెరుమాల్ దేవుడిని 27 నక్షత్రాల దేవుడని పిలుస్తారు.

   అంతేకాకుండా తొమ్మిది దేవుడని కూడా పిలుస్తారు. భక్తులు తమ కోరికను స్వామివారికి తెలిపి తొమ్మిది రుపాలయలు దక్షిణగా వేస్తే వెంటనే ఆ కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.

   కోర్కెలు నెరవేరిన తర్వాత వరుసగా తొమ్మిది రోజుల పాటు మరలా ఈ దేవాలయానికి వచ్చి దేవుడికి పూజలు చేయిస్తారు. విష్ణుపురాణంలో చెప్పినట్లు గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం ఇదే అని చెబుతారు.

   గజేంద్రుడి కాలును పట్టుకొన్న మొసలిని సంహరించిన ప్రదేశం ఇదేఅని ఇక్కడి వారి నమ్మకం. ఈ దేవాలయం సుమారు 1100 ఏళ్లకు పూర్వం నాటిదని చెబుతారు

   ఇక్కడ రామానుజాచార్యులు, ఆంజనేయస్వామికి ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం చెన్నైలోని కొయంబీడు బస్ స్టేషన్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

   ఈ దేవాలయం గురించి ఎక్కువ మందికి తెలియదు. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఇక్కడ మనకు కనిపించరు. అందువల్ల మనం స్వామివారి మహిమను ఎన్నిసార్లైనా కళ్లారా చూడవచ్చు.
గోవింద గోవిందా.....